చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించిన రాష్ట్రపతి

Sakshi-Spews-Venom-Ahead-of-Ram-Nath-Kovind--Amaravati-Visitప్రతిష్టాత్మక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మొదటి సారిగా అమరావతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీఎం చంద్రబాబుపై పొగడ్తలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేలా ఆర్థిక విధానాలు ఉండాలని, సామాజిక భద్రత ఉండేలా ప్రభుత్వ పాలసీలుండాలని కోవింద్ సూచించారు.

ఇంటింటికీ నాణ్యమైన సేవ‌లు అందించాల‌న్న ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం కేవ‌లం రూ.149ల‌కే ఒకే క‌నెక్షన్‌తో మూడు ర‌కాల సేవ‌లు (అంత‌ర్జాలం, టీవీ, ఫోన్) అందించ‌నుంది. ఇటువంటి వినూతన పధకం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చంద్రబాబును ఆయన ప్రశంసించారు.

ADVERTISEMENT

ఎపి పైబర్ గ్రిడ్ ద్వారా ఇళ్లకు సాంకేతిక పరిజ్ఞానం చేరుతుందని ఆయన అన్నారు. దేశానికి ఇది ఒక మోడల్ వంటిదని ఆయన అన్నారు.ఇరవైనాలుగువేల కిలోమీటర్ల పొడవైన కేబుల్ వేసినట్లు చెప్పారని, ఇది డిజిటల్ ఎపి ఆవిష్కరణకు ,డిజిటల్ ఇండియాకు ఇది దారి తీస్తుందని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories