
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణస్వీకార్మ్ చేయకముందే, ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో పేరుకుపోయిన చెత్త, చెత్త నిర్ణయాలను ఊడ్చేయడం ప్రారంభం అయ్యింది. ముందుగా చెత్తపన్ను పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన దోపిడీని తక్షణం నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు రావడంతో ఈ నెల నుంచి నుంచి రాష్ట్రంలో ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయరాదని జిల్లా స్థాయి కార్యాలకు ఉత్తర్వులు అందాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ అని తగిలించిన బోర్డులు మళ్ళీ ఎన్టీఆర్ పేరున మారుస్తున్నారు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
ఇక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలలో, వాటి అధికారిక వెబ్‌సైట్లలో జగన్, మంత్రుల ఫోటోలు తొలగించి వాటి స్థానంలో చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడుతున్నారు.
మరోపక్క ఫలితాలు వెలువడిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు అమరావతిలో క్లీనింగ్ పనులు మొదలుపెట్టారు. సుమారు 70 జేసీబీలు, లారీలు ఉపయోగిస్తూ రాజధాని ప్రాంతంలో మొలిచిన పిచ్చి మొక్కలను, పేరుకు పోయిన చెత్తా చెదారం తొలగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పాడుబెట్టిన భవనాలలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి మళ్ళీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని సిద్దం చేస్తున్నారు.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 11.27 గంటలకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటి పార్కులో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సమాచారం అందడంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శుభ్రపరిచి ఏర్పాట్లు చేస్తున్నారు.