‘శాతకర్ణి’ షూటింగ్ గుట్టువిప్పిన క్రిష్!

Gautamiputra Satakarni Shooting Locations - Krish‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయం చిత్ర యూనిట్ ఎంతటి కీర్తిప్రతిష్టతలను తెచ్చిపెట్టిందో, అదే స్థాయిలో క్రిష్ ను ఆకాశానికేత్తెసింది. రాజమౌళి నుండి మహేష్ వరకు అందరిదీ ఒక్కటే ప్రశ్న… 79 రోజులలో ఈ సినిమాను ఎలా తీయగలిగావు? అని! ఒక విధంగా చెప్పాలంటే ‘బాహుబలి’ విడుదలైన తర్వాత ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న ఎలాగైతే ఉత్పన్నమైందో, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలైన తర్వాత కూడా 79 రోజుల ప్రశ్న అదే స్థాయిలో సందడి చేసింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తానూ ఏ విధంగా షూటింగ్ జరిపి, 79 రోజులలో పూర్తి చేసానో వివరించాడు క్రిష్. మొత్తం సినిమాను నాలుగు భాగాలుగా విడగొట్టా. ఒక సెటప్ అమరావతి, రెండోది మొరాకో, సౌరాష్ట్ర, కల్యాణదుర్గం మూడో సెటప్, గ్రీకులతో జరిగే యుద్ధం చివరిది. ఈ నాలుగు భాగాలను మళ్లీ ఉప భాగాలుగా విడగొట్టాం. టీమ్ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించాం. మొరాకో షెడ్యూల్ కు ముందుగానే చిలుకూరు వద్ద ఓడ సెట్ వేశాం. అక్కడ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగానే… మరో యూనిట్ ను మొరాకోకి, ఇంకో యూనిట్ ను మహేశ్వరానికి పంపాం.

ADVERTISEMENT

చిత్రీకరణ పూర్తయిన దాన్ని ఎప్పటికప్పుడే ఎడిటింగ్ చేయించాం. వీటన్నిటికన్నా ముందుగానే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాం. పంచభూతాల సహకారం కూడా మాకు చాలా ఉంది. పక్కా ప్లానింగ్ తో, నా దగ్గర ఉన్న వనరులన్నింటినీ చక్కగా ఉపయోగించుకున్నా. అందుకే అనుకున్న సమయానికే సకాలంలో షూటింగ్ పూర్తి చేయగలిగాం. దేవుడు దయ లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయేవాళ్లం… అని క్రిష్ తెలిపారు. కేవలం టైటిల్ మాత్రమే విని… బాలయ్యకు కథ చెప్పడానికి అపాయింట్ మెంట్ తీసుకొచ్చిన కొమ్మినేని వెంకటేశ్వరరావుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories