
సంక్రాంతి పండుగ సాధారణ ప్రజలకే కాదు సినీ పరిశ్రమకు కూడా చాల పెద్ద పండుగనే చెప్పాలి. ఒక్క పండుగ ఆధారంగా మూడు నాలుగు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంచుతారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సంక్రాంతిని కాష్ చేసుకోవడానికి ఈ ఏడూ మూడు పెద్ద సినిమాలే బాక్స్ ఆఫీస్ ముందు పోటీ పడ్డాయి.
ఇందులో లేట్ ఛేంజర్ గా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి ఎట్టకేలకు ధియేటర్ల ముందుకొచ్చిన గేమ్ ఛేంజర్ సినీ అభిమానులను పూర్తిగా నిరాశ పరిచిందనే చెప్పాలి. కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేక పోయింది GC మూవీ. RRR వంటి బ్లాక్ బస్టర్ తరువాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన రామ్ చరణ్ కు ఈ గేమ్ ఛేంజర్ మూవీ సెట్ కాలేదు అనేది సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయంగా చెర్రీ GC ని ప్రేక్షకుడు తిరస్కరించాడు.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
ఇక జనవరి 12 న వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ మూవీ బాలయ్యకు మంచి హిట్ అందించినప్పటికీ, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ డాకు కలెక్షన్లను ప్రభావితం చేయగలిగింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన చివరి మూవీ వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. మంచి సంక్రాంతి ఫ్యామిలీ మూవీ గా సరదగా అందరిని పలకరించి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది వెంకీ SVS .
హీరోల గ్రాఫ్ పరంగా చూస్తే RRR వంటి భారీ విజయం తరువాత చెర్రీ కి గేమ్ ఛేంజర్ ఒక డిజాస్టర్ ను అందిస్తే, గత సంక్రాంతికి వచ్చిన వెంకీ సైన్ధవః మూవీ పరాజయం తరువాత ఈ సంక్రాంతికి SVS తో విక్టరీ కొట్టారు వెంకీ. ఇక అఖండతో మొదలైన బాలయ్య విజయపరంపర వీర సింహా రెడ్డి, భగవత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ తో కంటిన్యూ అవుతూ వస్తుంది.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఒక ఫెయిల్యూర్ మూవీ, ఒక యావరేజ్ మూవీ, ఒక బ్లాక్ బస్టర్ మూవీ తో టాలీవుడ్ ని పలుకరించి వారికీ ‘ఉగాది పచ్చడి’ అనుభూతిని అందించిందనే చెప్పాలి.