ఎన్నికల నాట ఇద్దరు చంద్రులకు శుభవార్త

Chandrababu Naidu and KCRపై రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఊరటనిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆల్‌రెడీ ఫుల్ అయ్యి గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు కిందకు వదులుతున్నారు. చాలా ఏళ్ల తరువాత నాగార్జున సాగర్ కూడా నిండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 225 టీఎంసీల నీరు ప్రాజెక్ట్ లో చేరింది.

ADVERTISEMENT

నాగార్జున సాగర్ పూర్తి సామర్ధ్యం 312 టీఎంసీలు. ఈ వారాంతానికి నిండవచ్చని అధికారుల అంచనా. దీనితో ఈ సంవత్సరం తాగు నీటికి, సాగు నీటికి కొరత ఉండదు అన్నట్టే. ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఈ పరిస్తితి ఉండటం రెండు రాష్ట్రల ముఖ్యమంత్రులకు కలిసి వచ్చేదే.

గత రెండేళ్లగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటి కోసం కొట్టుకోవడం చూశాం. ప్రాజెక్టుల వద్ద పోలీసులని కూడా మోహరించాల్సి వచ్చింది. పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది. మొత్తానికి ఈ సమస్య తీరనుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు రెండు రాష్ట్రాల రైతాంగానికి కూడా ఇది శుభవార్తె.

ADVERTISEMENT
Latest Stories