ఏపీ ప్రభుత్వ కౌంటర్ కూడా ఘాటే..!

Google Center row heats up between AP and Karnataka

త్వరలో విశాఖలో కొలువు తీరనున్న గూగుల్ సెంటర్ పై కర్ణాటక ప్రభుత్వం అక్కసుతో రగిలిపోతుంది. ముందుగా కర్ణాటక లో ఏర్పాటు చెయ్యాలనుకున్న గూగుల్ సెంటర్ ఆ తరువాత ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ఆకర్షితులయ్యి ఏపీలోని విశాఖకు తరలి వస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ చొరవని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. తమ రాష్ట్రానికి రావాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ తన పొరుగు రాష్ట్రమైన ఏపీకి తరలిపోవడంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తన అక్కసును వెళ్ళగగ్గుతుంది.

ADVERTISEMENT

“ఉచితాలు, సబ్సిడీలు ఆశగా చూపించి ఏపీ గవర్నమెంట్ గూగుల్ సెంటర్ ను దక్కించుకున్నారు, మేము పెట్టుబడుల కోసం అభ్యర్దించం, అడుక్కోము” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే దీనికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం కూడా తగ్గేదెలా అంటూ ముందుకెళ్లింది.

“ఏపీ పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫెవరేట్ టాపిక్ అయిపొయింది, మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తుంది” అంటూ సోషల్ మీడియాలో కర్ణాటక ప్రభుత్వానికి కాస్త ఘాటు రిప్లై ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ ఘటనలు చూస్తుంటే గూగుల్ సెంటర్ ను ఏపీకి తరలించేందుకు కూటమి ప్రభుత్వం ఎంతలా కృషి చేసిందో, మరెంతలా వారిని ఆకర్షించిందో అర్ధమవుతుంది.

అయితే ఈ సెంటర్ ఏర్పాటు కు వైసీపీలోనే భీజం పడిందని, అయితే ఆ క్రిడిట్ మొత్తం బాబు చోరీ చేస్తున్నాడు అంటూ క్రిడిట్ స్కోర్ కోసం పాకులాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మరి కర్ణాటక గవర్నమెంట్ కి ఎందుకు బదులు చెప్పలేకపోతున్నారు.

గూగుల్ సెంటర్ విశాఖకు రావడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి బాబు, ఐటీ మంత్రి లోకేష్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు, దీని వెనుక ఉన్న కర్త, కర్మ అంతా వైసీపీ దే, వైస్ జగన్ దే, ఈ విషయంలో మీరు ఎవరినైనా దూషించాలి అన్నా, ఎవరి పైనైనా అక్కసు ప్రదర్శించాలి అన్నా అందుకు వైసీపీ, జగన్ సిద్ధం అంటూ వైసీపీ ఎందుకు ముందుకు రావడం లేదు.

ప్రశంసలకు మాత్రమే వైసీపీ క్రిడిట్ తీసుకుంటుందా.? విమర్శలొస్తే అది కూటమి ఖాతాలోనే టీడీపీ అకౌంట్ లోనే వేసేస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories