ట్రైలర్ టాక్ – భయపెట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు!

Gruham Trailer Talk‘నువ్వొస్తానంటే నేనోద్దనంటానా…’ సమయంలో వరుసగా తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ సాధించిన సిద్ధార్ద్, వ్యక్తిగతంగా హీరోయిన్ సమంతతో బ్రేకప్ కావడం ఒకటైతే, ప్రొఫెషనల్ గా సక్సెస్ అనేది కనుచూపుమేరలో లేకపోవడంతో, సినిమాలు తగ్గిపోయాయి. విడుదల చేసిన డబ్బింగ్ బొమ్మలు ‘ఎన్.హెచ్.24’ వంటి సినిమాలు కూడా చతికిలపడడంతో కాస్త బ్రేక్ తీసుకున్న సిద్ధార్ద్, తాజాగా “గృహం” సినిమా ద్వారా భయపెట్టి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అంత నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించడంలో ఈ సినిమా ట్రైలర్ సక్సెస్ సాధించింది.

సక్సెస్ ఫుల్ హార్రర్ సినిమాలకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆసక్తికరమైన కధనం… ఇలా అన్ని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించారన్న నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. ఒక ఇంటిలో దెయ్యాలు ఉండడం, దాని నుండి రక్షించుకోవడం… ఇవన్నీ రొటీన్ అంశాలే అయినా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను పంచడంలో “గృహం” ట్రైలర్ సక్సెస్ అయ్యింది. మిలింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్ద్ సరసన ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories