రాజకీయాలలో ఎప్పుడు ఏ అంశం వివాదంగా మారుతుందో, ఏ పర్యటన ఎటువంటి విమర్శలను మోసుకొస్తుందో ఊహించడం కష్టమే అన్న సంగతి తాజాగా బిఆర్ఎస్ నేత హరీష్ రావు పర్యటనలు తేల్చి చెపుతున్నాయి.
హరీష్ రావు ఇటీవల మహారాష్ట్ర లోని దేవాలయాల సందర్శనకు వెళ్లారంటూ బిఆర్ఎస్ నేతలు చెపుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తెలంగాణలో కరువు రావాలని, తద్వారా రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటూ హరీష్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొదలుకుని తెలంగాణ సీఎం రేవంత్ వరకు హరీష్ టార్గెట్ గా క్షుద్రపూజల ఆరోపణలు చేసారు.
అయితే వాటిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సైతం ఖండించినప్పటికీ, తాజగా హరీష్ క్షుద్ర పూజల కాన్సెప్ట్ ను టిఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి తెరమీదకు తెచ్చారు, దానితో పాటుగా కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తానూ ఆమోదముద్ర వేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తారు అంటూ ఆరోపించడం వాస్తవమే అని అయితే ఆ పూజలు తెలంగాణ వినాశనం కోసమా లేదా అనేది తానూ చెప్పలేను కానీ, వాళ్ళ ఇంటి మనిషిగా తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం మాత్రం హరీష్ క్షుద్ర పూజలు చేస్తారని చెప్పగలను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడని హరీష్ క్షుద్ర పూజలు చేయిస్తారని, అది హరీష్ కి ముందు నుంచి ఉన్న అలవాటే అని, ఆ సంగతి జగమెరిగిన సత్యమే అంటూ కవిత హరీష్ టార్గెట్ గా చాల బలమైన ఆరోపణలు చేసారు. హరీష్ కి తనకు గేటు పంచాయితీ లేదని,
తన తండ్రిని అగౌరవ పరుస్తాడు అని, దగ్గరుండి తనను బిఆర్ఎస్ పార్టీకి దూరం చేసాడని, బిఆర్ఎస్ లో బీజేపీ కోవర్ట్ గా పనిచేస్తున్నారని…ఇలా హరీష్ ని గుంటనక్క అంటూ సంభోదిస్తూ ఆయన పై విమర్శలను పీక్స్ కు తీసుకెళ్లారు కవిత.
మరి హరీష్ టార్గెట్ గా కవిత చేసిన ఈ హాట్ కామెంట్స్ పై కేసీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా.? హరీష్ కు మద్దతుగా నిలబడతారా.? అయితే కవిత హరీష్ పై ఈ స్థాయి కామెంట్స్ వరకు వెళ్లే సాహసం చేసారంటే దాని వెనుక బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా.? ఒకవేళ ఉంటే అవి బయటపెడతారా.?
కేసీఆర్ టార్గెట్ గా హరీష్ క్షుద్ర పూజలు చేసే విషయం జగమెరిగిన సత్యమే అయితే ఆ సంగతి తెలిసే కేసీఆర్, కేటీఆర్ కవిత ను కాదనుకుని హరీష్ కి అండగా నిలుస్తున్నారా.? ఇక్కడే కవిత, హరీష్ మీద చేసిన క్షుద్ర పూజల ఆరోపణలు చాల బలహీనంగా కనిపిస్తున్నాయి.
పరిస్థితి చూస్తే ఈ క్షుద్ర పూజలు కాన్సెప్ట్ తెలంగాణ రాజకీయాలలో మరికొన్ని రోజుల పాటు మీడియాలో నానే లానే కనిపిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారే ఇలా క్షుద్ర పూజలు అంటూ సమాజంలో దశాబ్దాల నాటి నుంచి వెళ్లుడుముకున్న మూఢనమ్మకాలను బలపరుస్తూ వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తుండడం రాజకీయాలలో దిగజారిపోతున్న విలువలకు అద్దం పడుతున్నాయి..!
క్షుద్రపూజలు హరీశ్ రావుకు ముందు నుండి ఉన్న అలవాటు…
KCR ఆరోగ్యం బాగుండద్దని హరీష్ రావు క్షుద్రపూజలు చేయిస్తడు : కల్వకుంట్ల కవిత pic.twitter.com/DjqZ8bJCMu
— Kattar Congress (@kattarcongresii) August 27, 2026





