కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన పరిశ్రమలను ఆంధ్రకు తీసుకెళ్లిపోతారు!

Harish Rao anti andhra commentsమహాకూటమిని ఎదురుకోవడానికి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును తెరమీదకు తెస్తున్నట్టు ఉన్నారు తెరాస వారు. మహాకూటమికి ఓటు వేస్తే అమరావతి, ఢిల్లీ నుండి పాలన జరుగుతుందని అంటూ సీఎం కేసీఆర్ మొదలుపెట్టగా, కేటీఆర్, హరీష్ రావు కూడా అదే పల్లవి అందుకుంటున్నారు. హరీష్ రావు అయితే ఏకంగా ఒక అడుగు ముందుకు వేశారు.

ADVERTISEMENT

[m9ad]

కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన పరిశ్రమలను ఆంధ్రకు తీసుకెళ్లిపోతారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క తెరాస మాత్రమే అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆయన. మన కోసం పని చేసే కేసీఆర్ కావాలో ఆంధ్రోళ్ళ కోసం పని చేసే మహాకూటమి కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు ఆయన.

మరో సారి సెంటిమెంట్ పని చేసి తెరాసకు ప్రజలు పట్టం కడతారేమో చూడాలి. “తెదేపాకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ సమానమే. తెదేపా ఆంధ్రా పార్టీ కాదు. హైదరాబాద్‌ నడిబొడ్డున తెలుగు దేశం పుట్టింది. ఎన్‌టీఆర్‌ స్మారక ఘాట్‌ ఇక్కడే ఉంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. పేదలకు గొంతుకనిచ్చిన పార్టీ,” అని ఆ పార్టీ ప్రెసిడెంటు ఎల్ రమణ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories