మంత్రి హరీశ్‌ రావుకు తప్పిన ప్రమాదం

Harish Rao Escaped from firecrackers accident in bike rallyటీఆర్ఎస్ ఎన్నికల కాంపెయిన్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కూడలి వద్ద ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే బైక్ లకు అతిసమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో బైకులు వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీశ్‌రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు.

అనంతరం మంత్రిని అక్కడి నుంచి తరలించారు. ఆయనకు ఏ ప్రమాదము జరగకపోవడంతో ఆయన గన్ మెన్ లతో పాటు అక్కడ ఉన్న కార్యకర్తలందరు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలు కావడం, ఇప్పటికే 100కు పైగా సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు.

ADVERTISEMENT
Latest Stories