jagan-chandrababu-naidu-ap-assembly

ఐ‌టి రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని, దాంతో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు ఆనాడే గ్రహించి హైదరాబాద్‌లో బలమైన పునాది వేశారు. వాటిలో ఉద్యోగాలు సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచే ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ఇప్పుడు దానిని శాశించే స్థాయికి ఎదిగారు. అయితే జగన్‌ నిర్వాకం వలన ఈ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఐ‌టి రంగం కూడా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.

అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని ఏవిదంగా దానిని 5 ఏళ్ళు పాడుబెత్తెశారో, అదేవిదంగా ఐ‌టి రంగాన్ని ప్రోత్సహించినా దాంతో చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుందనే దురాలోచనతోనే జగన్‌ ఐ‌టి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పక తప్పదు.

Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి

కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా చంద్రబాబు నాయుడుని జగన్‌ కంటే ఎక్కువే ద్వేషిస్తారు. కానీ ఆయనపై ద్వేషంతో వారు ఐ‌టి రంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇంకా అభివృద్ధి చేసుకున్నారు. దాని వలన తెలంగాణ రాష్ట్రానికి భారీగా ఆదాయం, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐ‌టి రంగం పుణ్యమాని హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా భూముల ధరలు పెరిగాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. అది కళ్ళారా చూస్తున్నా జగన్‌ ఐ‌టి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఒకప్పుడు ఐ‌టి అంటే ఆంధ్రా అన్నట్లుండేది. కానీ జగన్‌ నిర్వాకం వలన ఐ‌టి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి ఏపీ పడిపోయింది.

2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరుగగా వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే!

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

దేశంలోనే ఎంతో వెనుకబడిన రాష్ట్రంగా ఉండే బిహార్‌ రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేయగా, రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు రూ.3,000 కోట్లు, వెనుకబడిన అస్సాం 24,000 కోట్లు, మేఘాలయ రూ. 35,000 కోట్లు, ఝార్ఖండ్ రూ.43,000 కోట్లు, హర్యాన రూ.52,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.55,000 కోట్లుచేశాయి.

గోవా రూ.1,57,000 కోట్లు, తమిళనాడు రూ.1,58,000 కోట్లు, తెలంగాణ రూ.1,81,000 కోట్లు, మహారాష్ట్ర రూ.2,37,000 కోట్లు, అత్యధికంగా కర్ణాటక రూ.3,96,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకుంటున్న జగన్‌ పాలనలో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కావడం సిగ్గుచేటు కాదా?

Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది