ఈ టైటిలా… అందరికీ తెలిసిందేగా..!

Hero Nani Movie with Kishore Tirumalaరెండు హ్యాట్రిక్ విజయాలను ముగించుకుని, మూడవ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్న ‘నాచురల్ స్టార్’ నాని ఖాతాలో మరో సినిమా వచ్చిపడింది. ‘నేను శైలజ’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తోన్న ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) సినిమా తర్వాత నాని నటించబోతున్న సినిమా ఇదే.

ADVERTISEMENT

అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ డిసైడ్ చేసారనే టాక్ ఊపందుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన ఓ ‘ఓల్డ్’ టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి బోలెడు ఛానల్స్ లేని సమయంలో… శుక్రవారం నాడు సాయంత్రం 7.30 నిముషాలకు దూరదర్శన్ లో వచ్చే “చిత్రలహరి” కార్యక్రమం ఆ తరం వారెవరూ మరిచిపోయి ఉండరు.

ఆ కార్యక్రమం టైటిల్ “చిత్రలహరి”నే నాని తన లేటెస్ట్ సినిమాకు డిసైడ్ చేసినట్లుగా ఓ టాక్. కిషోర్ తిరుమల ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న “ఉన్నది ఒక్కటే జిందగీ” సినిమా త్వరలో విడుదల కానున్న నేపధ్యంలో… తదుపరి నాని ప్రాజెక్ట్ ను పట్టుకుని, వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలుపెట్టుకుని సమ్మర్ టార్గెట్ గా విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories