సినీ హీరో కాస్త పచ్చళ్ళు అమ్ముకునే స్థాయికి వచ్చేసాడా ఏంటి అనుకుంటున్నారా… అవును… రామ్ వాళ్ళ అమ్మ చేసిన పచ్చళ్ళకు బాలీవుడ్ హీరో రితిష్ దేశ్ ముఖ్ ఫిదా కావడం… మళ్ళీ కావాలని అడగడంతో… ఈ సారి కావాలంటే సబ్ స్క్రిప్షన్ పే చేయాల్సిందేనని కండిషన్ పెట్టాడు రామ్.
ఇదంతా ట్విట్టర్ వేదికగా రితిష్ – రామ్ ల మధ్య జరిగిన సంభాషణ. ముందుగా రితిష్… ‘అమ్మ ఇచ్చిన పచ్చళ్ళు ఈ ప్రపంచంలోనే అద్భుతమైనవిగా కొనియాడి, నా దగ్గర ఉన్నవి ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ ఆర్డర్ వస్తుంది బ్రదర్’ అంటూ ట్వీట్ చేసాడు. దీనికి గానూ రామ్… ‘తప్పనిసరిగా మీకు నచ్చినందుకు గర్వంగా ఉంది, మంత్లీ సబ్ స్క్రిప్షన్ క్రింద అందజేస్తాను ఎల్ఓఎల్’ అంటూ ముగించాడు.
ఈ ఇద్దరి నాట కొనసాగిన ఈ ట్వీట్లు… మన తెలుగు పచ్చళ్ళకు ఉన్న డిమాండ్ ని తెలియజేస్తోంది. అదీ గాక, రామ్ లోని ఎనర్జీకి కారణం కూడా వాళ్ళమ్మ పచ్చళ్ళని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇది యువహీరో రామ్ పచ్చళ్ళ భాగోతం.



