2014 రాష్ట్ర విభజన నాటి నుండి కీలక డిమాండ్ గా ఉన్న హై కోర్టు విభజన తొందరలో జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నోటిఫికేషన్‌కు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు.
[m9ad]
ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే తేదీని (అపాయింటెండ్ డే) అందులో పొందుపరుస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పా టయ్యే ప్రాంతాన్ని కూడా నోటిఫై చేస్తారు. నోటిఫి కేషన్ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు హైకోర్టు ను తరలించాల్సి ఉంటుంది. ఈ గడువును పెంచాలని కోరే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. 2019 మేలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అవసరం అనుకుంటే టీడీపీ ప్రభుత్వం గడువు పెంచమని కోరే అవకాశం ఉంది. నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
డిసెంబర్ 15 నాటికి భవనం పూర్తవుతుందని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అయితే సంక్రాంతి తరువాత గానీ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. హైకోర్టు విభజనకు వీలుగా న్యాయమూర్తుల విభజన కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా 2018 మొదటి భాగంకు అటు ఇటుగా హై కోర్టు విభజన అనేది జరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీనితో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ వైపు నుండి ఉన్న అన్ని కీలక డిమాండ్లు నెరవేరినట్టే.



