కరోనా సమయంలో రాజధాని తరలింపు పై కంగారేందుకు?

High Court of Andhra Pradeshరాజధాని తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయ్యింది. హై కోర్టు ఈ విషయంపై మరోసారి స్టాటస్ కో ని పొడిగించింది. ఈ నెల ఇరవై ఏడు వరకు కేసును వాయిదా వేస్తూ, అంతవరకు యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అమరావతి ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు ఉండరాదని అంటూ కొందరు పిటిషన్ లు వేశారు. పాలనా వికేంద్రీకరణ , రాజదాని సంస్థ రద్దు చట్టాలపై విచారణ చేపట్టిన హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత కేసును వాయిదా వేసిన హైకోర్టు అంతవరకు యథాస్థితి కొనసాగించాలని పేర్కొంది.

ADVERTISEMENT

ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్‌ త్రివేది వాదించారు. ప్రభుత్వం కావాలంటే కేసును వాయిదా వెయ్యాలని, యథాస్థితిని మాత్రం కొనసాగించొద్దని కోర్టుని కోరింది. అయితే కరోనా సమయంలో రాజధాని తరలింపు పై కంగారేందుకు? అంటూ కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

దీనితో విజయదశమి నాటికి రాజధానిని విశాఖపట్నంకు తరలించాలనే ఆశలు చాలా వరకు సాధ్యపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయంగా ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. కాగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 500 పేజీల కౌంటర్ అఫిడవిట్ వేస్తూ, రాజధాని నిర్ణయం రాష్ట్రం పరిధిలోనిదని కేంద్రం కూడా తెలిపిన విషయాన్ని తెలియచేసింది.

ADVERTISEMENT
Latest Stories