హై కోర్టు విభజన కూడా రసాభాసగా మారే అవకాశం కనిపిస్తుంది. జనవరి 1 నుండి రెండు తెలుగు రాష్ట్రాల హై కోర్టులు విడిగా పనిచేస్తాయని గజెట్ నోటిఫికేషన్ రావడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు భవనాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో తయారు కాలేదు. ఇంకో 20 రోజుల సమయం పట్టొచ్చని సమాచారం. ఈలోగా హై కోర్టుకు ఇంకో తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నారట. జనవరి1 నుంచి విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం.
[m9ad]
20 రోజుల తర్వాత అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు ఉంటాయని తెలుస్తుంది. అమరావతిలో శాశ్వత భవనం నిర్మించిన తర్వాత ప్రస్తుత తాత్కాలిక హైకోర్టును జిల్లా కోర్టుగా మారుస్తామని చంద్రబాబు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే 20 రోజుల పాటు హై కోర్టు కార్యకలాపాలు స్థంబించిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 20 రోజుల కోసం విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసుకు తరలి వెళ్ళడం, మళ్ళీ నేలపాడుకు వెళ్ళడం జరిగే పని కాదని సమాచారం. దీనితో విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో ఏదో ఉంది అంటే ఉందన్నట్టు అనిపించే డైరెక్టుగా నేలపాడుకే పూర్తి స్థాయిలో తరలించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు ఉమ్మడి హైకోర్టు ఎదుట ఏపీ లాయర్ల ఆందోళనకు దిగారు. విభజనపై హైకోర్టు రిజిస్ట్రి జోక్యం చేసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. కటాఫ్ డేట్ పొడిగించాలని ఏపీ న్యాయవాదుల డిమాండ్ చేశారు. సిబ్బంది, ఫైళ్ల విభజన ఇంకా జరగలేదని, మూడు రోజుల్లో సిబ్బంది, న్యాయవాదులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అలాగే ట్రాన్స్‌ఫర్ పిటిషన్ల పరిస్థితి ఏమిటి అని ఏపీ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. దీనితో ఇబ్బందులు తప్పవు అని అర్ధం అవుతూనే ఉంది.
హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున ఉన్న చారిత్రక భవంతి సుమారు ఆరు దశాబ్దాలపాటు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుగా సేవలందించింది. ఇకపై ఈ భవనంలో తెలంగాణ హైకోర్టు మాత్రమే నడుస్తుంది. అమరావతి కేంద్రంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం దేశంలో 25వ హైకోర్టు. మరోవైపు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అరగంట తరువాత హై కోర్టు కు సంబంధించిన రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ కావడం విశేషం.



