మోడీ గవర్నమెంట్ ఏపీ గొంతు కోయడానికి ప్రయత్నించిందా? అవును అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. విషయంలోకి వెళ్తే ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి ఋణం కోసం ప్రయత్నిస్తుంది. ఎన్నో అవాంతరాలు ధాటి మొత్తానికి ఋణం మంజూరు చేయించుకుంది.
అయితే 2100 కోట్ల ఋణం మంజూరు అయిపోయాక ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ రెండు నెలలు ఆపుచెయ్యమని చెప్పిందంట కేంద్రం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తని అటు కేంద్రంగానీ రాష్ట్రంగానీ ధృవీకరించలేదు.
ఢిల్లీ సైతం అసూయ పడే రాజధానిని నిర్మించి ఇస్తాం అని చెప్పిన నరేంద్ర మోడీ తరువాత కాలంలో అమరవాతిని పట్టించుకున్నది లేదు. కేవలం 1500 కోట్లు ఇచ్చి అయ్యిందని అనిపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అమరావతి పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అయితే మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.
అయితే అటువంటి ప్రయత్నాలను కూడా అడ్డుకోవడం అంటే దుర్మార్గం అనే చెప్పుకోవాలి. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుని చంద్రబాబును ఫెయిల్యూర్ గా చూపించే ప్రయత్నం చేస్తుందా మోడీ ప్రభుత్వం? దీనిలో వారి విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? ఈ వార్త కనుక నిజమైతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో భారీ మూల్యం చెల్లించకతప్పక పోవచ్చు.



