సోషల్ మీడియా అంతా ఇప్పుడు అదే రచ్చ.!

Petrol Bunks Hyderabad

ఈ రోజు సోషల్ మీడియా అంతా పెట్రోల్ బంకులు, వాహనదారుల ఇక్కట్లతో నిండిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేసిన మోటర్ వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె బాట పట్టారు.

రాష్ట్రంలో పెట్రోల్ కొరత అనే వార్త తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైద్రాబాద్ వంటి మహా నగరాలలో ప్రజలను కంగారుపెట్టించింది. దీనికి తోడు కొన్నిపెట్రోల్ బంకుల ముందు “నో ఎంట్రీ బోర్డులు”., మరి కొన్ని బంకులలో “నో స్టాక్ బోర్డులు” దర్శనమివ్వడంతో వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. దీనితో హైద్రాబాద్ లో పలుప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

ADVERTISEMENT

చిన్న చిన్న కారణాలతోనే హైద్రాబాద్ లో పెద్ద పెద్ద ట్రాఫిక్ లైన్ లు దర్శనమిస్తాయి. అలాంటిది ఇంత పెద్ద సంఖ్యలో అది ఒకే సమయంలో ఇన్ని వాహనాలు రోడ్ల పై కి వచ్చి నిలిచిపోతే ఇక నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు “సీరియల్స్ బాధలను” తలపిస్తాయి. హైద్రాబాద్ రోడ్ల మీద జరుగుతున్న ఈ ట్రాఫిక్ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ ఒక ప్రకటన చేసారు.

తెలంగాణలో ఆయిల్ టాంకర్ల సమ్మె లేదని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయిల్ ట్యాంకర్లు యధావిధిగా పనిచేస్తాయని వాహనదారులకు ఒక క్లారిటీ ఇచ్చారు. దీనితో నగరంలో ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే బంకుల వద్ద రోడ్ల మీద నిలిచిపోయిన వాహనాలను, వాహనదారుల ఇబ్బందులనుషేర్ చేస్తూ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
Latest Stories