నయా ట్రెండ్ – నడిరోడ్డుపైనే తెగ నరకడం!

hyderabad attapur killing on roadమిర్యాలగూడలో నడిరోడ్డుపై ప్రణయ్ ని నరికిన తర్వాత, షార్ట్ గ్యాప్ లో హైదరాబాద్ లో కన్నకూతురు – అల్లుడు పైన నడిరోడ్డుపైనే దాడి జరిగిన సంఘటన చూసాం. బహుశా ఈ టైంలో ఇదేమైనా ట్రెండ్ అనుకుంటున్నారో ఏమో గానీ, తాజాగా మరో సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుని కలకలం రేపింది.

ADVERTISEMENT

[m9ad]

అక్రమ సంబంధ వేధింపుల కారణంగా 35 ఏళ్ళ రమేష్ ను నలుగురు వెంబడించి దారుణంగా నరికి చంపారు. విశేషం ఏమిటంటే…. ఈ ఘటన చోటు చేసుకుంటున్న సమయంలో పోలీస్ రక్షక్ వాహనం పక్కనే ఉండడం. అంటే పోలీసులు ఉన్నారన్న కనీసం భయం కూడా లేకుండా, హైదరాబాద్ లో దాడులకు తెగబడుతున్నారు.

ఈ సీరియల్ ఘటనకు కేసీఆర్ సర్కార్ లో జరిగాయి కాబట్టి, రాజకీయంగా రచ్చ రచ్చ కాలేదు గానీ, అదే ఇలాంటి ఘటనలు ఏపీలో గనుక జరిగి ఉండి ఉంటే, ఈ పాటికి పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డిలు చేసే హంగామా ఊహించవచ్చు. ఇదిలా ఉంటే, వ్యక్తిగత విభేదాల కారణంతో నడిరోడ్డుపైనే నరికి చంపే వరకు దారి తీస్తుండడం అనేది ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకువేళ్తుందో ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories