ఫస్ట్ లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది!

Idham Jagath Poster Talk‘మళ్ళీ రావా’ సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుమంత్, తన తదుపరి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. “ఇదం జగత్” అన్న టైటిల్ తో ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసాడు సుమంత్. సాధారణంగా ఇలాంటి టైటిల్స్ ను దర్శకుడు క్రిష్ తన సినిమాలకు పెడుతుంటారు. సంస్కృతంతో కూడిన ఈ టైటిల్ కు అర్ధం ‘ప్రపంచం అంటే ఇదే’ అని సుమంత్ స్పష్టం చేసారు.

ADVERTISEMENT

సుమంత్ కెరీర్ లో 24వ సినిమాగా తెరకెక్కుతోన్న “ఇదం జగత్”కు అనిల్ శ్రికాంతం దర్శకత్వం వహించారు. పాకాల శ్రీచరణ్ సంగీతం అందిస్తుండగా, జొన్నలగడ్డ పద్మావతే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా అయినా సుమంత్ కు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఆసక్తికరంగా ఉండడంతో, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories