మద్యం కుంభకోణం కేసులో పోలీసులు వైసీపీ అధినేత జగన్‌ని అరెస్ట్‌ చేయవచ్చనే ఊహాగానాలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.

గత 11 నెలలుగా జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశాల పేరుతో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్‌ కాబోతున్నారనే ఊహాగానాలు వైసీపీ శ్రేణులను కలవరపరచడం సహజమే. జగన్‌ అరెస్ట్‌ అయ్యి జైల్లో కూర్చుంటే పార్టీకి ఎవరు దిక్కు?అని అప్పుడే చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.

Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!

కనుక వైసీపీ శ్రేణులను మానసికంగా సిద్దం చేసేందుకో లేదా కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నంలోనో.. మద్యం కుంభకోణం అంటూ ఏమీ జరగలేదని, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ అభూత కల్పనని సృష్టించి తప్పుడు సాక్ష్యాధారాలు తయారు చేయిస్తోందని పేర్ని నాని వంటి వారు వాదిస్తున్నారు.

కానీ వారి వాదనలతోనే పార్టీ శ్రేణుల్లో మరింత గందరగోళం, భయాందోళనలు సృష్టిస్తున్నామని గ్రహించినట్లు లేదు. ఒకవేళ పేర్ని నాని వాదిస్తున్నగా ఇది నిజంగానే నకిలీ కేసే అయితే, నిందితులుగా పేర్కొనబడిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఎందుకు తిరస్కరించింది?

Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?

ఒకవేళ ఇది నకిలీ కేసే అని సుప్రీంకోర్టు భావించినట్లయితే ఈ కేసు విచారణపై స్టే విధించి ఉండేది కదా? కానీ ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పింది?ఎందువల్ల అని ఆలోచిస్తే ఈ కేసు నిజమైనదో కాదో అర్దమవుతుంది.

ఇక జగన్‌కు బాలాజీ గోవిందప్పకు ఏం సంబంధం?అనే పేర్ని నాని ప్రశ్నకు సమాధానం బయట వారికంటే వైసీపీ నేతలకు, పార్టీ శ్రేణులకే బాగా తెలుసు.

Also Read – కేసులు, నోటీసులా? డోంట్ వర్రీ.. వాటినీ వాడేసుకుందాం!

వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఇటువంటి వారందరూ చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు నమోదయ్యేసరికి ఒకరితో మరొకరికి సంబంధమే లేదని చెప్పుకుంటున్నారు. అంత మాత్రాన్న ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకుండాపోవు.

ఇప్పటికే సిట్ అధికారులు చాలా సేకరించారు. కనుక నేడో రేపో జగన్‌కు నోటీసులు ఇస్తారని, ఆ తర్వాత అరెస్ట్‌ చేసి జైలుకి పంపిస్తారని వైసీపీ ముందే పసిగట్టింది. అందుకే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అప్పుడే వైసీపీ నేతలు జగన్‌ అరెస్ట్‌ గురించి మాట్లాడేస్తున్నారనుకోవచ్చు.

జగన్‌ అరెస్ట్‌ ఖాయమని వారు భావిస్తున్నట్లయితే, సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం కంటే, పార్టీ పరిస్థితి, తమ పరిస్థితి ఏమిటనేది కూడా ఇప్పుడే ఆలోచించుకుంటే మంచిది కదా?