బాలీవుడ్ అవకాశాల కోసం హీరోయిన్లంతా ఎదురుచూస్తుంటారు. అందుకు ‘పోకిరి’ భామ ఇలియానా ఏమీ తక్కువ కాదు. ఏకంగా తెలుగు సినీ పరిశ్రమను వదులుకుని మరీ బాలీవుడ్ లో పాగా వేసింది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే ఇటీవల కాలంలో నిర్మాతలు బొత్తిగా మొహం చాటేయడంతో, అవకాశాల కోసం ఆశగా ఎదురు చూడడం ఈ గోవా బ్యూటీ వంతయ్యింది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మను హీరో అక్షయ్ కుమార్ కనికరించారని, దక్షిణాది హీరోయిన్లతో ఆడిపాడే అక్షయ్, తన తాజా సినిమా “రుస్తుం” కోసం ఇలియానాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వచ్చిన ఈ అవకాశం పట్ల సంతోషిచాల్సిన ఇలియానా ప్రస్తుతం బాధపడుతోందట. సౌత్ బ్యూటీలతో నటించిన అక్షయ్ ట్రాక్ రికార్డు హీరోయిన్ల పాలిట శాపంగా మారడమే ఇందుకు కారణం.
అక్షయ్ కుమార్ తో “ఖిలాడీ 786” సినిమా చేసిన తర్వాత ఆశిన్ ఏకంగా సినిమాలకు గుడ్ బై చెప్పడం, “స్పెషల్ చబ్బీస్” తర్వాత కాజల్ మళ్ళీ తెలుగు, తమిళ భాషల్లోకి రావాడం, “బేబీ” సినిమా తర్వాత తాప్సీ పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేకపోవడం వంటి పరిస్థితులను గమనించిన ఇలియానా పరిస్తితి అగమ్యగోచరంగా మారిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.



