
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారిని, వీసా గడువు ముగిసినా ఉంటున్నవారినీ గుర్తించి స్వదేశాలకు తిప్పి పంపేస్తున్నారు. సోమవారం నుంచి ఈ తరలింపులు మొదలుపెట్టారు. తొలివిడతలో 205 మంది భారతీయులను అమెరికా సైనిక విమానంలో తీసుకువచ్చి అమృత్‌సర్ విమానాశ్రయంలో విడిచిపెట్టారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లెక్కల ప్రకారం 7,25,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివశిస్తున్నారు. వారిలో ఇప్పటి వరకు 18,000 మంది భారతీయులను గుర్తించి 205 మందిని తిప్పి పంపారు.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
ఇంకా చైనీస్, పాకిస్తానీ, బంగ్లాదేశీ, ఆఫ్రికన్స్, ఫిలిపిన్స్, మెక్సికన్స్ తదితర దేశాలకు చెందినవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారందరికీ వెనక్కు తిప్పి పంపించేయాలని ట్రంప్ నిర్ణయం బాగానే ఉంది. కానీ వారిని అమెరికా ప్రభుత్వమే సొంత ఖర్చులతో స్వదేశాలకు తరలించాలంటే అసాధ్యమే. కనుక లేడికి లేచిందే పరుగు అన్నట్లు హడావుడిగా మొదలుపెట్టిన ఈ తరలింపు ప్రక్రియని ఇంకా ఎంతకాలం కొనసాగించగలదో అమెరికా ప్రభుత్వానికే తెలియాలి.
అయితే ఈ విషయంలో భారత్ స్పందన చాలా హుందాగా ఉంది. అక్రమంగా నివసిస్తున్నవారిని ఏ దేశమూ సమర్ధించలేదని, కనుక అమెరికాలో భారతీయులు అక్రమంగా నివశిస్తుండటాన్ని భారత్‌కి కూడా సమ్మతం కాదని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా నుంచి వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు భారత్ ప్రభుత్వం అమెరికాకి అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. ఈ సమస్యపై ప్రధాని మోడీ సరైన నిర్ణయం తీసుకుంటారని జై శంకర్ అన్నారు.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
అంటే ఇదివరకు వివిద దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిర్ ఇండియా విమానాలలో స్వదేశానికి తీసుకువచ్చిన్నట్లే అమెరికా నుంచి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందేమో?
కానీ అమెరికా నుంచి 7,25,000 లక్షల మందిలో కనీసం లక్ష మందిని తిరిగి తీసుకు రావలన్నా భారత్‌కి కూడా పెనుభారమే అవుతుంది కదా?మరి 7.25 లక్షల మందిని ఏవిదంగా తీసుకురాగలదు? ఒకవేళ ఏదోవిదంగా తీసుకువచ్చినా ఇంతటితో భారత్ నుంచి అమెరికాకి అక్రమ వలసలు నిలిచిపోవు కదా?
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
డోనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు అమెరికా శ్రేయస్సు కోసమే అయినప్పటికీ, అవే అమెరికా ప్రభుత్వానికి ప్రపంచదేశాలకు భారం కాకూడదు కదా?