సీనియర్ నిర్మాతపై ఐటీ దాడులు

Income Tax rides on producer kl narayana సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాలతో పాటు స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు.

హైదరాబాద్, విజయవాడలో సోదాలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ పలు హిట్‌ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. హలో బ్రదర్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన చాలా కాలంగా సినిమాలు చెయ్యడం లేదు. 2006లో విడుదలైన రాఖీ ఆయన చివరి సినిమా.

అయితే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చెయ్యడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం వారిద్దరికీ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తరువాత ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories