
భారత్ తో వైరం పాక్ జీవనప్రమాణానికి అత్యంత హానికరం అని తెలిసినప్పటికీ పాకిస్తాన్ తన ఉగ్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. భారత్ లో జరిగిన పెహాల్గమ్ ఉగ్రదాడి నేపధ్యం నుంచి ఇప్పటి వరకు భారత్ పై మేమే పై చెయ్యి సాధించాం, భారత్ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ ను ఏమాత్రం దెబ్బ తీయలేకపోయింది అంటూ పాక్ అధికారులు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ వచ్చారు.
అలాగే ఈ సందర్భంగా భారత్ – పాక్ ల మధ్య ఏర్పడ్డ యుద్ధం లో కూడా భారత్ పై పాక్ విజయం సాధించింది అంటూ అసత్య ప్రచారాలు చేసుకున్న పాక్ అక్కడితో కూడా శాంతించక అసలు భారత్ తో సీజ్ ఫైర్ ఒప్పందం మేము ప్రతిపాదించలేదు అంటూ ప్రగల్భాలు కూడా పలికారు.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
అయితే అసలు ఇరు దేశాల మధ్య యుద్దమనేదే లేకపోయినా, భారత ఆర్మీ రణరంగంలోకి ప్రవేశించకపోయినా పాక్ ను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టగలదు. అందుకు భారత్ అణుబాంబుల ప్రస్తవన తేనవసరం లేదు, క్షిపణి దాడులు చేయాల్సిన ఆవశ్యకత లేదు. కేవలం భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లే సింధు నది జలాలను నిలిపివేస్తే చాలు.
భారత్ తీసుకునే ఆ ఒక్క నిర్ణయం పాకిస్తాన్ ను ఎడారిగా మార్చేయగలదు, అక్కడి ప్రజా జీవనాన్ని స్తంభింప చేయనూగలదు. పెహాల్గమ్ ఉగ్రదాడి తరువాత భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ఉగ్రవాదానికి కళ్లెం వేయడానికి ముందుగా పాక్ తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసారు.
Also Read – వైసీపీ..ఒక “అందమైన” కుటుంబం..
అయితే నాడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పై అటు పాక్ అధికారులు, ఇటు పలు పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కూడా భారత్ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకుంటే సింధు నది లో పరిధి నీరు కాదు భారతీయుల రక్తం అంటూ పరిధి దాటి ప్రకటనలు చేసి భారతీయుల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశారు.
అయితే నాడు అన్ని ప్రగల్భాలు పలికిన పాకిస్తానీయులు నేడు నీళ్ల కోసం భారత్ తో కాళ్ళ బేరానికి దిగజారారు. సింధు జలాల ఒప్పందం పై భారత్ మరోసారి పునరాలోచించుకోవాలని, భారత్ నుంచి నీళ్లు రాకపోవడంతో పాక్ లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతుందని పేర్కొంటూ భారత్ ప్రభుత్వానికి పాక్ లేఖలు రాస్తూ తమ దీన స్థితిని మరోమారు బయటపెట్టుకుంది.
Also Read – బియ్యం మాయం వాస్తవం.. కనుక కేసు కూడా వాస్తవమేగా!
భారత్ పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే, పాకిస్తాన్ మాత్రం వారి దేశంలోని ఉగ్రవాదములకు వంత పాడుతూ పాక్ సరిహద్దు గ్రామాల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అనేకమంది అమాయకులను బలి తీసుకుంది, అలాగే ఈ భీకర పోరులో దేశ రక్షణ కోసం కొంతమంది భారత్ జవాన్లు వీరమరణం పొందారు.
ఇటువంటి నీచ బుద్ది తో కుక్క తోక వంకర మాదిరి అందితే జుట్టు అందక పొతే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించే పాకిస్తాన్ కుదిరితే భారత్ పై యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించింది అంటూ బీరాలు పోతుంది, లేకుంటే మాకు నీళ్లు ఇవ్వండి మహా ప్రభో అంటూ కాళ్ళ బేరానికి వస్తుంది. అయితే ఈసారి పాక్ తన ఉగ్రవాదాన్ని వదిలే వరకు సింధు జలాల ఒప్పందం తో భారత్ ఎట్టి పరిస్థితులలోను వెనకడుగు వెయ్యకూడదు అంటున్నారు భారతీయులు.