
ఇదివరకు పాక్ భూభాగంలో భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే, సర్జికల్ స్ట్రైక్ జరగలేదని, ఎన్నికల కోసమే భారత్‌లో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అబద్దాలు చెపుతోందని ప్రపంచదేశాలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేసి నవ్వులపాలైంది. అప్పుడు ఆ విదంగా ఎందుకు వాదించిందంటే భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసింది.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఈసారి కూడా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసింది. కానీ ఈసారి పాక్‌లో సుమారు వంద కిమీలోనికి చొచ్చుకుపోయి మరీ దాడులు చేయడంతో వాటిని దాచిపెట్టలేక ఎదురుదాడికి ప్రయత్నించింది.
దానికి భారత్ మరింత ధీటుగా రావల్పిండి తదితర ప్రాంతాలలో కీలకమైన పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై దాడులు చేసి వాటికి తీవ్రంగా దెబ్బ తీసింది.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
ఈ దాడులలో భారత్ సుమారు 8-10 బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. అందుకే రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్, యూపీ సిఎం యోగీ ఆధిత్య నాధ్ ఇద్దరూ ‘బ్రహ్మోస్ తడాఖా ఎలా ఉందో పాకిస్థాన్‌కు బాగా తెలుసు’ అని అన్నారనుకోవచ్చు.
ఈ దెబ్బకు పాక్ కాళ్ళబేరానికి వచ్చి కాల్పుల విరమణకు సిద్దపడిందని ప్రధాని మోడీ స్వయంగా చెప్పిన మాట వాస్తవమే అని పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ కూడా ధృవీకరిస్తున్నట్లు మాట్లాడారు.
Also Read – కేసులు, నోటీసులా? డోంట్ వర్రీ.. వాటినీ వాడేసుకుందాం!
ఆయన శుక్రవారం ఇస్లామాబాద్‌లో పాక్ సైనిక, వాయుసేన అధికారులతో సమావేశమైనప్పుడు “మే 9వ తేదీ రాత్రి నేను గాఢ నిద్రలో ఉండగా సైన్యాధ్యక్షుడు ఫోన్ చేసి భారత్ మన మీద క్షిపణులతో దాడులు చేస్తోందని చెప్పారు. అది విని నేను ఉలిక్కి పడ్డాను,” అని చెప్పారు.
భారత్‌పై అణు బాంబులు వేస్తామని బెదిరించిన పాక్ పాలకులు, ధైర్యం ఉంటే అప్పుడు కనీసం భారత్ దాడులను తిప్పి కొట్టి ఎదురుదాడులు చేసి ఉండాలి. కానీ కాల్పుల విరమణకు భారత్‌ని ఒప్పించమని సౌదీ రాజుని రాయబారం పంపారు.
మరోపక్క పాక్ అభ్యర్ధనని మన్నించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తమ విదేశాంగ మంత్రి, కార్యదర్శుల ద్వారా ప్రధాని మోడీతో మాట్లాడించి కాల్పుల విరమణకు ఒప్పించారు.
రష్యా మూడేళ్ళుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నా ఓడించామని చెప్పుకోలేకపోతోంది. కానీ పాక్‌పై దాడి చేయబోతున్నామని ముందుగా హెచ్చరించి మరీ భారత్ దాడులు చేసి, కేవలం మూడు రోజులలోనే పాక్‌ని ఓడించి కాళ్ళ బేరానికి రప్పించగలిగింది. పాక్‌పై భారత్ గెలుపుని ఇప్పుడు ఆ దేశ ప్రధాని కూడా ధృవీకరించడం ఇంకా విశేషం.