టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ లు గెలిచి మంచి ఊపులో ఉన్న టీమిండియా, టీ20లలో కూడా ఇంగ్లాండ్ ను మట్టి కరిపిస్తామనే ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇదంతా మ్యాచ్ మొదలవ్వక ముందు వరకు మాత్రమే. ఒక్కసారి మ్యాచ్ మొదలైన తర్వాత అంతా తారుమారు అయ్యింది. భారీ షాట్లు కొట్టేద్దామని భావించిన టీమిండియా బ్యాట్స్ మెన్లకు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి రెండు ఓవర్లలో భారీ షాట్లు కొట్టి 200 పరుగులు సాధించేలా కనపడిన టీమిండియా బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపడంలో ఇంగ్లాండ్ సక్సెస్ అయ్యింది.
మరోవైపు పరిస్థితిని అర్ధం చేసుకోకుండా అత్సుత్సాహం ప్రదర్శించిన విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు చేరడంతో, టీమిండియా భారీ స్కోర్ ఆశలు ఆవిరి అయ్యాయి. చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని ఓ రెండు ఫోర్లు కొట్టడంతో కనీసం 147 పరుగులైనా సాధించగలిగింది. టీమిండియా చెత్త బ్యాటింగ్ తీరును చూసి తీవ్ర నిరుత్సాహపడడం వీక్షకుల వంతయ్యింది. మరీ ఓవర్ గా దూకుడు ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో కెప్టెన్ గా విరాట్ కోహ్లికి తెలిసి వచ్చినట్లయ్యింది.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



