1927 నాటి పార్లమెంట్ భవనం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్?

Indian Parliament, Indian New Parliament, Indian New Parliament Building, Indian New Parliament Design, Indian New Parliament Construction, Indian New Parliament Plan, Indian New Parliament Location, Indian New Parliament Architecture  ఎప్పుడో దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు 1927లో నిర్మించిన పార్లమెంటు భవనానికి దాదాపు 88 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మరింత కాలం పాటు అదే భవనంలో పార్లమెంటును కొనసాగించడం ఇబ్బందికరమని ఇటీవల లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్దారు. ఈ భవనాన్ని కూల్చేసి రాజ్ పథ్ ప్రాంతంలో పార్లమెంటుకు కొత్త భవనం కడితే బాగుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడుకు ఓ ప్రతిపాదన చేశారు.

తాజాగా ఈ ప్రతిపాదనకు మోడీ సర్కారు కూడా మద్దతు పలికింది. పార్లమెంటుకు కొత్త భవనానికి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా త్వరలోనే ప్రభుత్వం ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా… అది పూర్తయ్యేందుకు మరో అయిదారేళ్ళ సమయం పడుతుందని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సరికొత్త పార్లమెంట్ అత్యాధునిక సౌకర్యాలతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories