అబివృద్ధి, సంక్షేమం కళ్ళకు కనిపిస్తోంది.. చెప్పుకుంటే మంచిదే!

Intintiki Telugu Desam campaign in Andhra Pradesh

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు. ఏ ప్రభుత్వమైనా కుదుట పడటానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత అసలైన పాలన మొదలవుతుంది.

ఈ లెక్కన కేవలం ఏడాదిన్నరలోనే సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధించడం మామూలు విషయం కాదు.

ADVERTISEMENT

ముఖ్యంగా రెండుసార్లు ఎదురుదెబ్బలు తిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఇంకా కష్టం. కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఇలాంటి పరీక్షలు, సవాళ్ళు ఎదుర్కొని అధిగమించడం అలవాటే. కనుక ఎప్పటికైనా కోలుకోగలదా.. అనే పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, కేవలం రెండేళ్ళలోనే ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి చేర్చారు.

అయన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పధకాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ అమరావతి మొదలు డీఎస్సీ వరకు ప్రతీ దానిపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తూనే ఉంది.

కనుక దానిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం చేసిన, చేయబోతున్నవాటి గురించి ప్రజలకు వివరించాలని సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ పార్టీని ఆదేశించారు.

వారి ఆదేశం మేరకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు.

ప్రతీ ఒక్కరూ ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, వారి అభిప్రాయాలు, సూచనలు, స్థానిక సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

గత ప్రభుత్వం కూడా ‘గడప గడపకి ప్రభుత్వం’ పేరుతో ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. అయితే తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను, అభివృద్ధిని విస్మరించి, కేవలం సంక్షేమ పధకాలనే అమలు చేస్తున్నందున, వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజల వద్దకు వెళ్ళేందుకు వెనుకంజ వేసేవారు.

కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలతో పాటు, అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి పనులు చేస్తోంది. ముఖ్యంగా లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తూ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.

కనుక టీడీపి చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీలో మంత్రులు మొదలు కార్యకర్తలు వరకు అందరూ హుషారుగా పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలందరికీ తెలుస్తాయి. ముఖ్యంగా సంక్షేమ పధకాలపై జరుగుతున్న దుష్ప్రచారం, వాస్తవాలు అర్ధమవుతాయి.

అన్నిటికీ మించి లను ప్రభుత్వం-ప్రజల మధ్య అనుబందం బలపడుతుంది. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు చెప్పుకోవడం అవసరమే కదా?

ADVERTISEMENT
Latest Stories