చివరికి చిదంబరాన్ని శాసించేది ఎవరు..?

Chidambaram Stadium

తాజాగా ముగిసిన ఐపీఎల్ 2024 లీగ్ స్టేజి లో కోల్ కతా జట్టు అగ్రస్థానంలో నిలవగా, రెండవ స్థానాన్ని భర్తీ చేసారు హైదరాబాద్ జట్టు. అప్పటివరకు మొదటి స్థానాన్ని ఒడిసి పట్టుకున్న రాజస్థాన్ మాత్రం లీగ్ స్టేజి చివరి దశలో గాడి తప్పి, మూడవ స్థానానికి పరిమితమయ్యారు. లీగ్ దశలోనే వెనుతిరుగుతుందని భావించిన బెంగళూరు అనూహ్యంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.

లీగ్ దశ మధ్య క్రమంలో కూడా పదవ స్థానాన్ని రెండు చేతులా పట్టుకున్న బెంగళూరు జట్టు , లీగ్ యొక్క రెండవ దశ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నారు. ఇది ఐపీఎల్ చరిత్ర లో నే గ్రేటెస్ట్ కంబ్యాక్ గా వ్యాఖ్యానిస్తున్నారు క్రికెట్ పండితులు.

ADVERTISEMENT

అయితే మంగళవారం రోజున ఏడు గంటలకు ప్రారంభం కానున్న క్వాలిఫైయర్ 1 లో కోల్ కతా మరియు హైదరాబాద్ జట్టులు తలపడనున్నారు. అలాగే బుధవారం సాయంత్రం మొదలయ్యే ఎలిమినేటర్ కు రాజస్థాన్ మరియు బెంగళూరు అర్హత సాధించగా, రెండు మ్యాచులు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.

అయితే క్వాలిఫైయర్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు, ఓడిన జట్టు కు మరొక అవకాశం రానుంది. ఓడిన జట్టు క్వాలిఫైయర్ 2 వేదికగా ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు తో తలపడుతుంది. ఎలిమినేటర్ లో ఓడిన జట్టు ఇంటికి చేరుకోవాల్సిందే. వారు టోర్నీ నుండి నిష్క్రమించబడ్తారు.

ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే, క్వాలిఫైయర్ లో ఏ జట్టు గెలుస్తుందో అని ఊహించడం కష్టమైన విషయం. రెండు జట్టులు సమ ఉజ్జీలు గా అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉన్నారు. ఎలిమినేటర్ లో మాటికీ బెంగళూరు జట్టు ఫేవరేట్ గా ఉండనుంది.ఆడిన చివరి ఆరు మ్యాచ్ లను గెలిచి వారు ఎలిమినేటర్ లో అడుగుపెట్టనున్నారు.

చూడాలి మరి, ఎలిమినేటర్ లో ఏ జట్టు గెలిచి చిదంబరంలోని క్వాలిఫైయర్ ను చేరుకుంటారో. ఇక, ఫైనల్ కూడా అదే స్టేడియంలో జరగనుండగా, రెండవ క్వాలిఫైయర్ శుక్రవారం జరగగా, ఫైనల్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముహూర్తం ఖరారయ్యింది. చూడాలి మరి చివరిగా చిదంబరంలో జయకేతాలను ఎగరబోయేదేవరో..?

ADVERTISEMENT
Latest Stories