Will RCB Overcome Home Ground Fobia

నిన్న జైపూర్ వేదికగా జరిగిన ‘రాయల్స్’ క్లాష్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బయట గ్రౌండ్లలో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఇప్పటికే ఈ ఐపీఎల్ లో 6 మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు, అందులో కేవలం 2 మ్యాచ్లే సొంత గ్రౌండ్ లో ఆడారు. తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి మైదానం RCB పాలిట శాపం గా మారిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

నిన్నటి రాయల్స్ క్లాష్ లో విజయాన్ని చూసిన రాయల్ చాలెంజర్స్ ఇప్పటికి 4 మ్యాచ్లను బయట గ్రౌండ్స్ లో ఆడగా, చిత్రమేమిటో కానీ వారు బయట ఆడిన 4 మ్యాచ్ లలోను ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, అదే బెంగళూరు తమ సొంత గ్రౌండ్ లో ఆడిన 2 మ్యాచ్లలోను ఓటమి చెందారు.

Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?

ప్రతి జట్టు సీజన్ లో 14 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా, అందులో సగం, అనగా 7 మ్యాచ్లను సొంత గ్రౌండ్ లోను, ఆ మిగిలిన 7 మ్యాచ్లను బయట గ్రౌండ్లలో ఆడాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియలో చూస్కుంటే, సొంత గ్రౌండ్ ప్రతి జట్టుకి కంచుకోట వంటిది.

చెన్నై, ముంబై, హైదరాబాద్, గుజరాత్, రాజస్థాన్ వంటి జట్లు బయట ఎలా ఆడినప్పటికీ, తమ సొంత గ్రౌండ్ అనేసరికి రెచ్చిపోయి ప్రదర్శిస్తుంటారు. అటువంటి సమయంలో, జట్టుకు సొంత గ్రౌండ్ అనేది అధనమైన భరోసా అవుతుంది.

Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…

కానీ, మొదటినుండి బెంగళూరు జట్టుకు తమ సొంత గ్రౌండ్ కంచుకోటగా కాదు కదా, వారి పాలిట శాపం లాగా మారుతూ వస్తుంది. కీలక మ్యాచ్ లలో సైతం బెంగళూరు వేదికగా ఆ జట్టు ఎన్నో ఓటములను చవి చూసింది.

మరి ఈ సీజన్లో బెంగళూరు జట్టు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా విజయాలతో దూసుకుపోతుంది. అలాగే ఆ జట్టు విజయలన్ని కూడా కేవలం ఒక్క ఆటగాడి కష్టంతో కాకుండా, జట్టు మొత్తం కలిసి-కట్టుగా సమిష్టి కృషితో ఆడి సాధించినవే కావడం ఆ జట్టుకి మరింత బలంగా మారుతుంది.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!


కానీ, వారిని ఈ హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్ శాపం లా వెంటాడుతుండటంతో ఆర్.సీ.బీ అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఆర్.సి.బీ జట్టు కనుక తమ సొంత కండిషన్స్ పై పట్టు సాధిస్తే, తమ 18 ఏళ్ళ కప్పు నిరీక్షణకు ఈ సీజన్ తో స్వస్తి పలికే అవకాశాలు లేకపోలేవు.
మరి ఏప్రిల్ 18 న పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆర్.సి.బి తమ హోమ్ గ్రౌండ్ లో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ తో అయినా ఆర్.సి.బి ప్లేయర్స్ ఈ హోమ్ గ్రౌండ్ ఫోబియా నుండి తప్పించుంటారా లేదా అనేది చుడాలి.