ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఐపీఎల్ ఆక్షన్ ఆఖరికి ముగిసింది. అయితే, ఈ ఆక్షన్ లో అభిమానులు ఆశించినవి, ఆశించనివి, ఊహించనివీ, ఉహించనవి..ఎన్నో చోటు చేసుకున్నాయి.
ముందుగా,అందరు ఊహించినట్టే రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర ను సొంతం చేసుకున్నారు. ఏకంగా 27 కోట్ల విలువ తో ‘లక్నో సూపర్ జయింట్స్’ పంత్ ను దక్కించుకున్నారు. అలాగే అంటారు ఊహించినట్టుగానే అయ్యర్ కూడా 26 .75 కోట్ల ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
అయితే, ఇక్కడ ఎవ్వరు ఊహించని వింతలు కూడా చోటుచేసుకున్నాయి. వెంకీ అయ్యర్ కు 23 కోట్ల ధర పలుకుతుందని ఎవ్వరు కలలో కూడా ఊహించలేదు. ఆర్.సీ.బీ జట్టు సైతం అభిమానులు ఊహించని పనులెన్నో చేసింది.
ఈసారి ఐపీఎల్ కు రాహుల్ ఖచ్చితంగా ఆర్.సీ.బీ జట్టు లోనికి రానున్నాడాడని విస్తృతమైన ప్రచారం జరిగింది.తీరా చూసుకుంటే ఆర్.సీ.బీ పంత్, రాహుల్, జాక్స్, సిరాజ్, చాహల్, మాక్స్వెల్, డు ప్లెసిస్ వంటి ఎందరో ఎక్స్-ఆటగాళ్ళని కొనేందుకు మొగ్గు చూపలేదు. భువి ను 10 కోట్లకు కొనుగోలుచేశారు ఆర్.సీ.బీ.
అయితే, ఆక్షన్ ను యాక్షన్-ఫుల్ గా మార్చింది మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి. చురుకుగా అన్ని పెద్ద ఆటగాళ్ల బిడ్ ల లోను పాల్గొని వారి ధర ను అమాంతం పెంచేసి, తాను నెమ్మదిగా పక్కకు జారుకున్నారు. చివరికి, ఈ స్ట్రాటజీ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ను అద్భుతంగా ఎంచుకున్నారు జట్టు యాజమాన్యం. రాహుల్, స్తర్క్, నటరాజన్, జేక్, బ్రూక్, డు ప్లెసిస్, అశుతోష్ వంటి స్టార్ ఆటగాళ్లను జట్టు లోకి తీసుకోగలిగారు.
ఎప్పటి లానే చెన్నై జట్టు చాల చాకచక్యంగా, వారికి ఏ ఆటగాడి అవసరం ఉందో, వారినే జట్టు లోకి తీస్కొని, వారి పాత ఆటగాళ్లను తిరిగి వేలంలో దక్కించుకున్నారు. ముంబై జట్టు సైతం ఆక్షన్ లో మంచి ఆటగాళ్లను తక్కువ ధర కే కొనుగోలు చేయగలిగారు. ఇక గుజరాత్ జట్టు ఎన్నో మంచి ఎంపికలు ఎంచుకున్నారు. స్టార్ ప్లేయర్స్ ను చాల తక్కువ ధర కే దక్కించుకోగలిగారు.
ఆక్షన్ కు అత్యంత ఎక్కువ ధర తో వచ్చిన పంజాబ్ సైతం తమ జట్టును అద్భుతంగా రూపుదిద్దారు. రాజస్థాన్ జట్టు కూడా ఆక్షన్ లో మంచి ఆటగాళ్లను తీసుకుని, టీం లో ఆ నిలకడతనాన్ని జారనివ్వలేదు. హైదరాబాద్ జట్టు ఇప్పటికే పవర్-ఫుల్ గా ఉన్న బ్యాటింగ్ దళాన్ని ఇషాన్, అభినవ్ తో మరింత పవర్-ఫుల్ గా మార్చారు. ఇలా,ప్రతి జట్టు మంచి ఎంపికలు చేసి, ఐపీఎల్ 2025 పై ఆశలను తార స్థాయి కి వెళ్లేలా చేసారు.
మరి ఈసారైనా ఆర్సీబి తమ అభిమానుల కోరికను, ఆ జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ కప్పు కలను నెరవేరుస్తారా.? అలాగే గత సీజన్ లో కెప్టెన్సీ మార్పుతో రచ్చ చేసుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి తమ సత్తా చూపిస్తారా.? మిస్టర్ కూల్ మరోసారి చెన్నై జట్టుకు ఐపీఎల్ కప్పు అందిస్తారా.? ఇలా ఏ జట్టు అభిమానులు ఆ జట్టు కు ఇక ఆక్షన్ ముగిసింది యాక్షన్ లోకి దిగండి అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




