ఊళ్ళో పబ్లిక్ టాయిలెట్ వద్ద పెద్ద క్యూలైన్… సిఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? వీధిలో మురుగు కాలువ వారం రోజులుగా క్లీన్ చేయలేదు… సిఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు?
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ… సిఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? సంక్రాంతికి రైళ్ళు, బస్సులు కిటకిట… సిఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఫలానా గుడి క్యూలైన్లో భక్తులు తోపులాట… సిఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు?
ఇవేం ప్రశ్నలనుకుంటున్నారా? సోషల్ మీడియాలో వైసీపీ రోజూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతోంది మరి! వీటన్నిటికీ సిఎం చంద్రబాబు నాయుడిదే బాధ్యత అంటోంది!
కానీ సిఎం చంద్రబాబు నాయుడు కర్ర పట్టుకొని క్యూలైన్లని నియంత్రించాల్సిన తన బాధ్యతని విస్మరించారని వైసీపీ ఆరోపిస్తోంది. కనుక క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి మనుషులు ప్రాణాలు పోతే దానికి సిఎం చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని హెచ్చరిస్తోంది! బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదేనేమో?
రాష్ట్రంలో అనేక వ్యవస్థలు, వాటిలో వేలాదిమంది అధికారులు, ఉద్యోగులు పని చేస్తుంటారు. తిరుమల లేదా మరో పుణ్య క్షేత్రంలో కూడా ఇలాగే సిబ్బంది పనిచేస్తున్నారు. క్యూలైన్లను నియంత్రించాల్సిన బాధ్యత వారిదే తప్ప సిఎం చంద్రబాబు నాయుడుది కాదు కదా?
ఒకవేళ టిటిడీ సిబ్బంది లేదా స్థానిక పోలీసులు సక్రమంగా పనిచేయకపోతే వారిని పర్యవేక్షించేందుకు పై అధికారులున్నారు. ఇలా అనేకమందితో ఏర్పడిన బలమైన వ్యవస్థలున్నాయి. వాటన్నిటినీ పర్యవేక్షించేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు చాలా మందే ఉన్నారు.
ఇంతమంది వ్యవస్థలలో పనిచేస్తుంటే, వైసీపీ సోషల్ మీడియాలో సిఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు, నోటికొచ్చినట్లు పోస్టులు పెడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోతే అందుకు ఆయన బాధ్యత వహించారా? కనీసం ఆగి అతనిని ఆస్పత్రికి తరలించారా? లేదే? పైగా దానికీ సిఎం చంద్రబాబు నాయుడిదే తప్పన్నట్లు మాట్లాడారు కదా?
తమ తప్పులను ధైర్యంగా అంగీకరించి ఒప్పుకోలేనివారు ఇతరులను వేలెత్తి చూపిస్తూ నిందిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? అని వైసీపీ ఆలోచించాలి కదా?
తిరుపతిలో దర్శన టికెట్ల కోసం భక్తులు మళ్లీ అవస్థలు
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్లు కోసం బారులు తీరిన భక్తులు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడకుండా గాలికొదిలేసిన టీటీడీ
క్యూలైన్లో తోపులాటతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు. భక్తుల్ని… pic.twitter.com/96hRFVkMQe
— YSR Congress Party (@YSRCParty) December 25, 2025




