
ఏ రంగంలో అయినా ఒక వ్యక్తికి తగిన గుర్తింపు, గౌరవం దక్కాలంటే దానికి ‘సక్సెస్’ అనే ఒక బలమైన పునాది కావాలి. ముఖ్యంగా ఈ సమస్య సినీ రంగ ప్రముఖులను నీడలా వెంటాడుతుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది, సక్సెస్ మాత్రమే నడిపిస్తుంది.
సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు తెచ్చిన గుర్తింపు, గౌరవం, గర్వం అన్ని కూడా ఒకటి, రెండు అపజయాలతో దూరమవుతూ ఉంటాయి. దానికి ఈ సినీ పరిశ్రమకు చెందిన ఎందరో నటీనటులు, దర్శక, నిర్మాతలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. ఒకప్పుడు విజయాలతో స్టార్ హోదా అనుభవించిన వాళ్ళు సైతం అపజయాలకు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇందుకు చక్కటి ఉదాహరణగా తాజాగా విడుదలైన శంకర్, గేమ్ ఛేంజర్ మూవీ ని చూపించవచ్చు. ప్రేమికుడు, జెంటిల్ మెన్, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శంకర్ నాడు అటు తమినాటే కాకా తెలుగులోనూ ఎంతో మందికి ఫేవరేట్ దర్శకుడిగా మారిపోయారు.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
కానీ ఇప్పుడు భారతీయుడు-2 , గేమ్ ఛేంజర్ సినిమాల అపజయాలతో అటు సినీ విశ్లేషకుల నుండి ఇటు సాధారణ సినీ ప్రేక్షకుడి వరకు ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్నారు. అసలు శంకర్ కు ఏమయ్యింది? శంకర్ అప్ డేట్ అవ్వలేకపోతున్నారా.? శంకర్ భారీ బడ్జెట్ మీద పెట్టిన శ్రద్ద, భారీ కథనం మీద పెట్టలేకపోతున్నారా.? ఇక శంకర్ రిటైర్మెంట్ ప్రకటిస్తాం మేలు ఇలా ఎన్నో విమర్శలు శంకర్ విజయ గర్వాలను కిందకు దించుతున్నాయి.
GC మూవీ కూడా ఒక మంచి మెసెజ్ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ దానిని ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు అనేది సర్వత్రా వినిపిస్తున్న టాక్. ఒక్క సినిమాలోనే IAS , IPS , CM … అంటూ ఇలా అర గంటకో వేరియేషన్ తో హీరో ని చూపిస్తూ, అందులోను హీరోకి డబల్ రోల్ క్యారెక్టర్ ఇచ్చి ఏ పాత్రలోనూ సగటు ప్రేక్షకుడికి హీరో క్యారెక్టర్ తో కనెక్షన్ లేకుండా చేసారు.
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?
దీనితో GC మూవీ కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూలు ఎదురయ్యాయి. RRR తరువాత వచ్చే రామ్ చరణ్ మూవీ ఈ స్థాయిలో నెగటివిటీని ఎదుర్కోవడం ఆయన అభిమానులకు దర్శకుడి మీద ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో విజయాలు అందించిన ఒకప్పటి స్టార్ దర్శకుడు శంకర్ ఇప్పుడు రెండు అపజయాలతో విమర్శలు పాలయ్యారు. దీనితో విజయాల కన్నా అపజయానికే బలమెక్కువా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.