గత ఐదేళ్లు ఏపీ లో జరిగిన రాజకీయం రాజకీయాలకే రాజకీయాన్ని నేర్పించాయా అన్నట్టుగా సాగాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రులుగా భావించిన ఘటనలు వైసీపీ ప్రభుత్వంలో కోకొల్లలు అనే చెప్పాలి. అలాగే తన రాజకీయంలోకి సినీ పరిశ్రమను లాగిన ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వమనే చెప్పాలి.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా, ఎవరు ప్రశ్నించినా వారికీ కేసులు, అరెస్టులు, జైళ్లు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చే వారు అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్. అయితే ఆ అరెస్టులు కూడా ఎక్కువగా శుక్రవారం నాడే జరిగేవి. శని, ఆది వారలు కోర్టుకు సెలవు దినాలు కావడంతో ఆ అరెస్టయిన వ్యక్తికీ శుక్రవారం బైలు రాకపోతే ఇక ఆ మూడు రోజులు సదరు వ్యక్తి జైలుకి పరిమితం కాకా తప్పని పరిస్థితి.
Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!
ఇటువంటి రాజకీయ ఎత్తుగడలతో వైస్ జగన్ రెడ్డి ఆరితేరిపోయారనేది గత ఐదేళ్ల ఆయన పాలన చూస్తే యిట్టె అర్ధమవుతుంది. అలాగే తనకు తగిన ప్రాతినిధ్యం దొరకని సినీ పరిశ్రమను కూడా వైసీపీ విడిచిపెట్టలేదు. సినీ ఇండస్ట్రీలో సిఎం గా బాబు కి దక్కినంతగా గౌరమర్యాదలు జగన్ కు దక్కలేదనే అక్కసుతో అటు సినీ పరిశ్రమను కూడా తన కనుసన్నలలో కొనసాగేలా శాసించారు జగన్.
అయితే దాని ఫలితం నేడు అనుభవిస్తున్నప్పటికీ ఇంకా అవే రాజకీయ విధానాలతో ముందుకెళ్తున్నారు వైస్ జగన్. అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా రాజకీయం నడుపుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నేడు అల్లు అర్జున్ అరెస్టు మీద తన స్పందన తెలియచేసిన సీఎం రేవంత్ చట్టం తన పని తానూ చేసుకుపోతుంది, చట్టం ముందు అందరు సమానులే అంటూ ముగించారు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
అయితే నేడు జరిగిన అల్లు అర్జున్ అరెస్టు కూడా శుక్రవారమే జరగడం యాధృచ్ఛికమా.? లేక వైసీపీ అధినేత జగన్ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతున్నారా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జగన్ రెడ్డి మాదిరే రేవంత్ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారా.? అనేది తెలియాల్సి ఉంది. ఫార్ములా జగన్ ది వాడితే ఫలితం కూడా జగన్ మాదిరే ఉంటుంది సుమీ.
రేవంత్ కూడా జగన్ మాదిరే కక్ష్య రాజకీయాలకు తెరలేపితే దాని ఫలితం కూడా వైసీపీ మాదిరే ఊహకు కూడా అందకుండా ఉంటుంది. సామాన్యుడికి న్యాయం చేయడం తప్పు కాదు. అలా అని మరి ఇంత దుందుడుకు చర్యలు కూడా ప్రజలు హర్షించరు. అటు సంధ్యా ధియేటర్ యాజమాన్యం అక్కడికి హీరో అల్లు అర్జున్, హీరోహిన్ రష్మిక వస్తున్నట్టు మేము ముందుగానే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చామని సాక్ష్యాలు చూపిస్తున్నారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
అధికారులు మాత్రం మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది అంటూ హీరో ను బాధ్యుడిగా చూపిస్తూ అరెస్టు చేసారు. ఇందులో వాస్తవం ఎవరిదీ.? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది తేలితే సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరికికినట్టే అవుతుంది.
ఇక్కడ పోలీసుల ఆరోపణలు ఒక దిక్కునుంటే…ధియేటర్ యాజమాన్యం చూపించే సాక్ష్యాలు మరో దిక్కుననున్నాయి. మరి ఎవరి వాదనలో వాస్తవం ఎంత అనేది ఇక ఆ న్యాయస్థానాలే తేల్చాల్సి ఉంటుంది.