అలా చేస్తే ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి మేలు చేసినట్టే

IYR Krishna Rao tnam Parliament?ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తొలుత విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు ఆయనను అసెంబ్లీకి పంపే యోచన చేస్తున్నట్టు సమాచారం. విజయవాడ సెంట్రల్ నుండి ఆయనను పోటీకి నిలబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఇదే జరిగితే ఆయన టీడీపీకి మేలు చేసినట్టే.

[m9ad]

ADVERTISEMENT

వైకాపా నుండి బ్రాహ్మణ కులానికే చెందిన మల్లాది విష్ణు ఇక్కడ నుండి పోటీ చెయ్యబోతున్నారు. అదే కులానికి చెందిన ఐవైఆర్ కృష్ణారావు పోటీ చేస్తే ఆ సామాజికవర్గం ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి బోండా ఉమాకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఐవైఆర్ కృష్ణారావు ఆయన బద్ధశత్రువైన టీడీపీకి హెల్ప్ చేసినట్టే.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. ఆయన రిటైర్ అయ్యాక ప్రభుత్వం ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ను చేసింది అయితే తరువాతి కాలంలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చెయ్యడంతో తప్పించింది. అప్పటినుండి ఆయన ప్రభుత్వానికి బద్ద శత్రువుగా మారిపోయారు.

ADVERTISEMENT
Latest Stories