ఇదేమి లాజిక్ జగన్?

Jagan about pawan kalyan janasenaపాదయాత్రలో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా రోజులతరువాత సాక్షి కాకుండా ఒక టీవీ ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా జగన్ ను పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి, వైకాపా మీద ఎఫెక్ట్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

ADVERTISEMENT

“జనసేన వల్ల కొత్తగా మాకు జరిగే నష్టమేమీ ఉండదు. పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు గత ఎన్నికలలోనే టీడీపీకు ఓటు వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయన చీలుస్తాడనేది అపోహ మాత్రమే” అని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇందులో లాజిక్ ఏంటో అర్ధం కాలేదు. గత ఎన్నికలలో మోడీ, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన చాలా సార్లు చెప్పారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ టీడీపీకి ఉపయోగపడితే ఇప్పుడు మాత్రం ఎందుకు ఉపయోగపడదు? జగన్ పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేస్తున్నారా? లేక బింకం ప్రదర్శిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ను చూసి భయపడకపోతే ఎందుకు ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై తరచు విరుచుకుపడతారో?

ADVERTISEMENT
Latest Stories