ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్న వైస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఓటమి తరువాత వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ బెంగళూర్ టూ తాడేపల్లి పర్యటనలు సాగిస్తున్నారు. ఇక చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టైం పాస్ రాజకీయాలు నడుపుతున్నారు.
అన్న జగన్ అసెంబ్లీని వదిలి మీడియాప్రెస్ లో మీట్లు నిర్వహిస్తూ తనకు ఈ సారి మరో ఛాన్స్ కావాలంటూ రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. చెల్లి షర్మిల ప్రజా పోరాటాలు మాని వ్యక్తిగత పోరుకి ప్రాధాన్యం ఇస్తూ ఒంటరి రాజకీయానికి కట్టుబడ్డారు.
వైసీపీ ఘోర ఓటమితో ఊహించని అవమాన్ని ఎదుర్కున్న వైస్ జగన్ ఏపీలో అతిధి పాత్ర పోషిస్తూ బెంగళూర్ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టాలి అంటే ఒకటి పరామర్శల పేరుతో శవ రాజకీయాలైన చెయ్యాలి, లేదా ఓదార్పు యాత్రల పేరుతో బలప్రదర్శనకైనా సిద్ధపడాలి.
గత ఏడాదిన్నర్ర నుంచి వైసీపీ చేస్తున్న రాజకీయం ఇదే, వైస్ జగన్ అనుసరిస్తున్న విధానాలు ఇవే. నాటి బుడమేరు వరదల నుంచి నేటి కర్నూల్ బస్సు దగ్ధం వరకు వైసీపీ రాజకీయంలో ఎటువంటి మార్పు లేదు, అలాగే జగన్ నుంచి సాక్షి వరకు చేసే ప్రచారాలు మారలేదు.
ఇక షర్మిల విషయానికొస్తే షర్మిల రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత వివాదాలకే ప్రధమ ప్రాధాన్యం అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. పార్టీ బలోపేతం మీద ద్రుష్టి లేదు, ప్రజా సమస్యల పట్ల శ్రద్ద లేదు, ఏపీ రాజకీయాలలో తానూ కూడా ఉన్నాను అని తన ఉనికి తెలుపుకోవడానికి తప్ప షర్మిల రాజకీయం అటు రాష్ట్రానికి కానీ ఇటు పార్టీకి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు.




