ఎక్కడో తేడాగా ఉందే..?

YS Jagan KCR

2023 తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించే మగాడే లేడు, బిఆర్ఎస్ పార్టీ తప్ప తెలంగాణలో మరో పార్టీని ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు అంటూ భీరాలు పోయిన కేసీఆర్ కు ఆశలు ఆకాశంలో ఉన్న కాళ్ళు నేల మీదే ఉండాలి అని తెలియ చెప్పారు తెలంగాణ ఓటర్లు. అధికార అహంకారంతో ప్రజలలో వచ్చిన మార్పుని చూడలేకపోయిన బిఆర్ఎస్ నాయకత్వానికి వాస్తవిక ప్రపంచాన్ని చూపించారు రేవంత్ రెడ్డి.

ఎగ్జిట్ పోల్స్ లోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖరారైనప్పటికీ పార్టీ క్యాడర్ ను నిలబెట్టుకోవడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి బిఆర్ఎస్ నాయకులకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసారు. ఫలితాల విడుదలకు రెండు రోజుల ముందు మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ మరో రెండు రోజులలో మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఎవ్వరు భయపడాల్సిన అవసరం గాని అధైర్య పడాల్సిన విషయం కానీ ఎం జరగదు. అందరూ ధైర్యంగా ఉండండి అంటూ పార్టీ క్యాడర్ కు ఓదార్పు మాటలు చెప్పారు.

ADVERTISEMENT

సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్ కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం, వైసీపీ ఎత్తుగడలకు కూటమి నేతలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టడం, ప్రజలు నోటుకు కాకుండా ఓటుకు విలువనివ్వడం, అలాగే సర్వేలన్నీ కూటమికి పట్టం కట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ రెక్కలు విరిగాయి అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో వైసీపీ నాయకులలో నైరాశ్యం ఆవరించింది.

వైసీపీ పార్టీ క్యాడర్ కూడా తమకున్న చివరి అస్త్రాలన్నీ ఒడ్డి పోరాడుతున్నాయి. ఇందులో అమాయక ప్రజలు బలవడంతో ప్రజలలో వైసీపీ నేతల పట్ల అసహనం వ్యక్తమవుతోంది. ఇక వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇక మీతో నా పని పూర్తయ్యింది అన్నట్టుగా ఇక మీ చావు మీరు చావండి అంటూ అటు పార్టీ క్యాడర్ను, ఇటు రాష్ట్ర ప్రజలను దాడులకు వదిలేసి విహార యాత్రల పేరుతో విదేశీ పర్యటనలకు బయలుదేరారు.

విదేశాలకు వెళ్లే ముందు ఓటమి భయంతో వణుకుతున్న వైసీపీ నాయకులను ఉద్దేశించి వారి ఐ పాక్ టీం తో ముచ్చటించారు. ఎవ్వరు కంగారుపడొద్దు. గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీని మించి వైసీపీ సీట్లను సాధిస్తుంది. ఎవ్వరు ఊహించని ఫలితాలను చూడబోతున్నాం అంటూ దీనంగా తన ఆపార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చారు జగన్. ఇదంతా చూస్తుంటే ‘ఇక్కడో ఎదో తేడా కొడుతుందే’ అంటూ సోషల్ మీడియాలో ఫలితాల ముందు కేసీఆర్ చేసిన వ్యాక్యలను, ఇపుడు జగన్ చెప్పిన మాటలను సరిపోల్చి చూస్తున్నారు.

తానూ ఓడినప్పటికీ తన మిత్రుడు జగన్ అయినా గెలవాలి అని ఆశ పడిన కేసీఆర్ ఆశలను ఏపీ ప్రజలు కూడా నీరుకార్చినట్టే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరి తయారయ్యింది. ఇక ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘బిఆర్ఎస్ కుడితి లోనుంచి ఏకకంగా బావిలో’ పడినట్టే, అలాగే ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తే ‘బైలు నుంచి జైలులో’ పడినట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ADVERTISEMENT
Latest Stories