మనం పాటించని మతం, మనం నమ్మని దేవుడు, మనకు తెలియని పురాణాలు, వాటిలో కొటేషన్లు గురించి మాట్లాడితే మనమే నవ్వులపాలవుతాము.
కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉన్నారు కనుక ఈ మతాలకు, దేవుళ్ళకు అతీతుడు. అందుకే క్రీస్టియన్ మతాన్ని అవలభించే అయన తరచూ హిందూ పురాణాలలోని కొటేషన్స్ చెపుతుంటారు.
కృష్ణాష్టమి వంటి పండుగలు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పేరుతో చంద్రబాబు నాయుడుకి మెసేజ్‌లు పంపిస్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఇలాంటి సందేశాలు చూసి వెంటనే జవాబు ఇచ్చే మంచి అలవాటు లేదు.
ముందు జగన్ సందేశం రిసీవ్ చేసుకుందాం. “అధర్మం ఎంత బలంగా ఉన్నా… అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా… అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు,” అని జగన్ సందేశం.
ఇది తమ కోసమే అని ప్రజలు కూడా అనుకోవడం లేదు. కానీ జగన్ మెసేజులు ఎన్నడూ వృధా కావు. సోషల్ మీడియాలో అభిమానులు చాలా మందే ఉన్నారు. ఓపికగా చదివి సారాంశం అర్ధం చేసుకొని తప్పక స్పందిస్తుంటారు. అటువంటి కొందరు అభిమానుల స్పందనలు…
జైల్లో పుట్టిన శ్రీకృష్ణుడిని ఈరోజు తలుచుకోవడం మంచిదే. అక్కడి నుంచే వచ్చిన మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళబోతున్నారనే విషయం గ్రహించినందుకు అభినందనలు.
మీరు చేప్పింది అక్షరాల నిజమని మీ ఓటమితోనే రుజువైంది కదా?
పులివెందులలో ధర్మం గెలిచిందని ఒప్పుకున్నందుకు థాంక్స్.
రప్పా రప్పా అంటూ మళ్ళీ నీతులు ఎందుకన్నా?
గుండెపోటుతో చనిపోయిన బాబాయ్ వివేకానంద ఆశీస్సులు మీకు లభించుగాక!
ఇలా రెండు మతాల మద్య ఊగిసలాట మనకెందుకు జగనన్నా?మొదటికే మోసం వచ్చింది కదా?ఏదో ఒకటి ఫాలో అవ్వొచ్చు కదా?
నిన్న ఆగస్ట్ 15న జెండా ఎందుకు ఎగరేయలేదన్నా? పదవిలోనే ఉంటేనే ఎగరేస్తావా?
ప్రెస్‌మీట్ పెట్టి కాగితం చూసుకొని మాట్లాడుతున్నా తడబడుతుంటావు… అలాంటి నువ్వు ఇంత గొప్ప కొటేషన్స్ ఎలా చెప్తున్నావన్నా? ఇది ఎవరు వ్రాశారో చెప్పవా ప్లీజ్?
ఇది వాస్తవం…. ఈ వాస్తవాన్ని అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకొని ఉంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేవారు కదా?
కనుక జగన్ మెసేజులు చంద్రబాబు నాయుడు పట్టించుకోకున్నా కోకపోయినా అభిమానులు చాలా మందే ఉన్నారు. వారందరికీ ఈ సందేశం చేరింది. జవాబులు కూడా వచ్చాయి. కనుక నో వర్రీస్!






