దేవుడా… ఇలా దూకిందేంటి జగన్ మీదకి..!

jagan-lady-fan-jumps-on-him-during-padayatra‘ప్రజా సంకల్ప యాత్ర’లో భాగంగా జగన్ చేస్తున్న పాదయాత్ర ‘శుక్రవారం’ బ్రేక్ ల నడుమ నిరంతరాయంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా, కదిరి అసెంబ్లీ నియోజకవర్గం, ఎన్పీకుంట మండలంలో జగన్ పాదయాత్ర సాగుతున్న వేళ, ఓ మహిళ ఉన్నట్లుండి జగన్ మీదకు దూకడం సెక్యూరిటీ వర్గాలను కలవరపెట్టింది. జగన్ ను ముద్దాడాలనే తాపత్రయంతో సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని ఒక్కసారిగా దూకడంతో అప్రమత్తమైన బౌన్సర్లు ఆమెను వెనుకకు లాగే ప్రయత్నం చేసారు.

అయితే వారిని వారించిన జగన్, ఆమెను దగ్గరకు తీసుకుని యధావిధిగా తన స్టైల్లో నుదుటి మీద ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అత్యుత్సాహం కలిగిన అభిమానులు ఈ విధంగా ప్రవర్తించడం షరామామూలే. అందులోనూ పాదయాత్ర అంటే… సదరు నాయకుడు అందుబాటులో ఉంటారు కాబట్టి, ఎలా అయినా తన అభిమాన నేతను కలుసుకోవాలనే తాపత్రయం కనపడుతుంది. ఈ ఉదంతంతో సదరు మహిళ వార్తల్లో నిలిచింది. అయితే ఇలాంటి చర్యలు పాదయాత్రలో ఉన్న సెక్యూరిటీ లోపాన్ని స్పష్టంగా బయట పెడుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories