
ఐప్యాక్ రాజకీయాలు, అసత్య గ్లోబల్ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన వైసీపీ తన ప్రభుత్వ హయాంలో ‘మూర్కపు’ రాజకీయాలతో ముందుకెళ్తే, బాబు ప్రభుత్వంలో ‘మాయ’ రాజకీయాలతో దూసుకుపోతుంది.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో వైస్ జగన్ మీద జరిగిన కోడికత్తి దాడి, ఆయన సొంత చిన్నాన్న వైస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య ఘటనలు జగన్ మాయ రాజకీయాలకు నిదర్శనాలైతే, నాడు టీడీపీ ప్రభుత్వం మీద వైస్ జగన్ చేసిన నిందారోపణలు, నాటి ముఖ్యమంత్రి బాబు మీద వేసిన నారాసుర రక్తచరిత్ర అనే హత్యారోపణలు వైసీపీ భూటకపు రాజకీయాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.
అయితే నాడు తన బాబాయ్ హత్యకు టీడీపీ కారణమంటూ, దాని బాధ్యత బాబు దంటూ గగ్గోలు పెట్టిన జగన్ తన ఐదేళ్ల అధికారంలో ఆ కేసుని నీరుగార్చిడానికి, ఆ కేసులో దోషిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ అవినాష్ రెడ్డిని కాపు కాయడానికి తన ముఖ్యమంత్రి పదవిని కవచంలా అడ్డుపెట్టారు. అలాగే బాధిత వివేకా వ్యక్తిగత జీవితం మీద, ఆయన కూతురు సునీత మీద వైసీపీ చేసిన నీచ రాజకీయం ‘నా భూతో న భవిష్యతి’ అనే చెప్పాలి.
Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్
అయితే 2024 ఓటమితో వైసీపీ అధికారానికి దూరమైనప్పటికీ కొని విషయాలలో రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మాత్రం ఇప్పటికి కొనసాగించ గలుగుతున్నారు వైస్ జగన్. దీనికి రాష్ట్రంలో జరిగిన తాజా మరణమే సాక్షిగా నిలిచింది. వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మాన్ రంగన్న మృతి పై అటు ఆయన కుటుంబ సభ్యులు, ఇటు పోలీస్ అధికారులు, అలాగే ప్రభుత్వం కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
తన భర్త రంగన్న మృతి పై తనకు అనుమానంగా ఉందంటూ ఇప్పటికే రంగన్న భార్య పోలీసులను ఆశ్రయించింది. దీనితో రంగన్నది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఇక నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అనంతరం దీనిపైనా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పమేనని ఆరోపించారు.
Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?
వివేకా కేసులో ముఖ్య సాక్షిగా ఉన్న వ్యక్తి మరణించాడు అంటే అది వైసీపీ హత్యా రాజకీయాలు కావచ్చు, లేక జగన్ మాయ రాజకీయాలు కావచ్చు అనే అనుమానాలు అటు ప్రభుత్వ పెద్దల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి కుట్ర రాజకీయాలలో జగన్ సిద్దహస్తుడని, అందువల్ల ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించడం తప్పనిసరి అని సీఎం పోలీస్ అధికారులకు సూచనలు చేసారు.
అయితే వివేకా హత్యను నీరుగార్చేందుకు ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఒక్కొక్కరు ఒక్కో కారణంతో మృత్యువు ఒడిలోకి చేరుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. వాచ్ మాన్ రంగన్న తో కలిపి ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు సాక్షులు కాలం చేసారు. ఇక వివేకా హత్యా కేసులో కీలక పాత్ర దారి దస్తగిరి తన ప్రాణాలకు రక్షణ లేదంటూ మీడియా ముందు పలుమార్లు ప్రకటనలు చేసారు.
అలాగే వివేకా కుమార్తె సునీతా కూడా ఏపీలో తమ ప్రాణాలకు భద్రతా లేదు అనే ఆరోపణతో గత ఆరేళ్లుగా తన తండ్రి హత్యకు న్యాయం కావాలంటూ కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వాలు మారినా సునీత పోరాడటానికి న్యాయం జరగడం లేదు. దానికి తోడు ఇలా ఆ కేసులో సాక్షిగా ఉన్నవారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు.
దీనితో జగన్ మాయ రాజకీయాలను టీడీపీ ఛేదించలేకపోతుందా.? లేక బాబు వైసీపీ భూటకపు రాజకీయాలను కట్టడి చేయలేకపోతున్నారా.? అనే ప్రశ్నకు కూటమి బదులు చెప్పాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నాడు టీడీపీ హయాంలోనే వివేకా హత్య జరిగింది, నేడు వివేకా కేసులో ముఖ్య సాక్షి మరణం సంభవించింది. కనీసం ఆ కేసునైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఛేదించి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.