వైసీపీ అధినేత జగన్ ఈరోజు తాడేపల్లి ప్యాలస్ ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు, అనేక ఆరోపణలు చేశారు.
“చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలు. ఈ వయసులో కృష్ణా రామా అనుకుంటూ కూర్చోకుండా ఇన్ని తప్పులు, పాపాలు చేయడం అవసరమా?వీటికి రేపు ఆయనే మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే ఇంగితం లేదా?” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు కంటే జగన్ వయసు తక్కువ కనుక తాను మరో 25-30 ఏళ్ళు రాజకీయాలలో ఉంటానని అనుకోవడం సహజం. కానీ రాజకీయాలలో కొనసాగేందుకు యువకుడు అయ్యుండటం అర్హత కానే కాదు.
అయినప్పటికీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించేశారు కదా? జగన్‌కి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చాతకాదని ప్రజలు భావించబట్టే చంద్రబాబు నాయుడుకే మళ్ళీ అధికారం కట్టబెట్టారు కదా?
తన పులివెందుల కంచుకోటలో జరుగుతున్న సాధారణ జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపిని ధీటుగా ఎదుర్కోలేక చేతులెత్తేసిన జగన్, చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వచ్చే ఎన్నికలలో కూటమి పార్టీలను ఓడించగలనని ఎలా అనుకుంటున్నారు?ఒకవేళ ఓడించగలిగితే 2024 ఎన్నికలలోనే ఓడించి ఉండాలి కదా?
పులివెందులలో టీడీపిని ఎదుర్కోలేక జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తూ ఉత్తర కుమారుడిని తలపిస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి తాడేపల్లి ప్యాలస్‌లో జగన్ ప్రెస్‌మీట్ పెట్టడమే ఆయన అసమర్ధతకి నిదర్శనం కాదా?
వచ్చే ఎన్నికలలో కూడా ఇదే కూటమి, ఇదే ఎన్డీయే ఉంటాయి. ఇటువంటి చిన్న ఎన్నికలలో కూడా టీడీపిని ఎదుర్కోలేక చేతులెత్తేసిన జగన్ వచ్చే ఎన్నికలలో కూటమిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని ఏవిదంగా ఓడించగలమని అనుకుంటున్నారో చెప్పగలరా? అంటే చెప్పలేరు.
175/175 సీట్లు మనకే వస్తాయని చెప్పుకోవడం తేలిక. కానీ వాటిని సాధించడమే చాలా కష్టమని 2024 ఎన్నికలలోనే జగన్‌కి అర్దమై ఉండాలి కదా?
అయినా ఏ ఒక్క కేసులో దోషిగా నిరూపించబడినా జైలు జీవితం తప్పదు కదా?మరీ ఉత్తరకుమార ప్రగల్భాలు దేనికి?




