ఇన్నాళ్ళుగా ఏపీ వినాశనానికి రాష్ట్ర విభజన కారణమని, ఆ తరువాత ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడమే రాష్ట్రానికి పెద్ద సమస్య అని, దానికి తోడు రాష్ట్రానికి రాజధాని లేకపోవడమే ఏపీ కి శాపంగా మారిందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు,
ఇప్పుడు ఏపీని పట్టి పీడిస్తున్న అసలు సమస్య వైసీపీ నే అని, దాన్ని పెంచి పోషిస్తూ రాష్ట్రంలో అరాచకారం సృష్టిస్తున్న జగనే ఏపీ ప్రగతికి ఆనకట్ట కడుతున్నారని స్పష్టమైపోయింది.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తుందని మీడియా ముందుకొచ్చిన వైస్ జగన్ తన ఆక్రోశాన్ని, అసహనాన్ని వెళ్లగక్కారు.
అయితే అసలు విషయానికొస్తే బాబు విజనరీ లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న PPP విధానంతో మెడికల్ కాలేజీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ అంశాన్ని ప్రయివేటీకరణ అంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అటు బెదిరింపులకు పాల్పడుతుంది.
ఈ బిడ్డింగ్ లో పాల్గొనే సంస్థలకు చెపుతున్న రేపు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో ఈ టెండర్లను రద్దు చేసి వాటన్నిటిని వెనక్కి తీసుకుంటాం అంటూ ppp విధానంలో బిడ్డింగ్ లో పాల్గొనే సంస్థలను వైస్ జగన్ బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.
2019 ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ రాజధానిగా అమరావతి కి వైసీపీ కట్టుబడి ఉంది అంటూ కట్టుకథలు చెప్పి అధికారంలోకి వచ్చాకా మూడు ముక్కలాట ఆరంభించారు. అలాగే అటు పోలవరం లో రివర్స్ టెండరింగ్ అంటూ ఏపీ భవిష్యత్ ని రివర్స్ చేసి చూపించారు.
అయితే నాడు అధికారం కోసం కట్టుకథలు అల్లిన జగన్ అధికారం వచ్చాక అసలు రంగు చూపించారు. కానీ నేడు అధికారం లేకుండానే రాష్ట్ర ప్రగతి కోసం ముందుకొస్తున్న పారిశ్రామిక వేత్తలను ఈ రకంగా బెదిరించడం అంటే అది ముమ్మాటికీ రాష్ట్ర వ్యతిరేక చర్యగానే భావించాలి.
కూటమి ప్రభుత్వం వెంటనే వైసీపీ అరాచకాలకు, జగన్ బెదిరింపులకు చెక్ పెట్టకపోతే ఇప్పుడిప్పుడే వైసీపీ అనే వినాశాన్ని మరిచిపోయి ఏపీ వైపు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొత్తగా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు కొత్తగా ఎవరు ఆసక్తి చూపించారు.
వైసీపీ ఉన్నప్పుడు రాష్ట్రం పై విశ్వాసాన్ని కోల్పోయిన బడా వ్యాపార వేత్తలు కూటమి రాకతో వైసీపీ రాదు అని బాబు, పవన్ , లోకేష్ ఇస్తున్న భరోసాతో తిరిగి ఏపీ వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే అది కేవలం ఏపీ ప్రగతికి అడ్డుకట్ట వేయడమే అవుతుంది.
తన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరగని అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, రాజధాని నిర్మాణం, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త పురోగతి, అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు కలగలిపి జగన్ ను ఈ స్థాయికి దిగజార్చాయా.?
రప్ప రప్ప అంటూ రాష్ట్రంలో వైసీపీ మొదలు పెట్టిన జగన్ 2.0 రాజకీయం ఏపీని e దారికి చేరుస్తుందో. ఒక్కడా జగన్ ఆవేశం ఖరీదు కన్నా కూటమి ఓర్పు ఖరీదు ఏపీకి ఎక్కువగా నష్టాన్ని చేస్తుంది.పార్టీ క్యాడర్ నుంచి పార్టీ అధినేత వరకు ఇదే విధమైన రాజకీయం చేస్తూ ఏపీ భవిష్యత్ ని ప్రశ్నార్ధకంలో పడేస్తున్నారు.
రాజధాని నుంచి రాష్ట్ర ప్రగతి వరకు జగన్ అనుసరిస్తున్న బెదిరింపు రాజకీయాలు రాజకీయ పార్టీలను కాదు రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నాయి. అధికార పార్టీ రమ్మని ఆహ్వానిస్తుంటే ప్రతిపక్షం పొమ్మని పొగ పెడుతుంది.
వైసీపీ అధికారంలో లేకుండానే, జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజామోదం పొందకుండానే ఈ రకంగా బెదిరింపులు, హెచ్చరికలు చేస్తుంటే రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే.? ఇక అది ఊహకు కూడా అందని విధ్వంశమే అవుతుందేమో బహుశా..!




