విలక్షణ పాత్రలు చేస్తున్న జగపతిబాబు తాజాగా “పటేల్ ఎస్.ఐ.ఆర్.” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలాకాలం తర్వాత ప్రధాన పాత్రలో కనిపిస్తున్న జగపతిబాబు, ఈ కధ వినగానే బాగా నచ్చిందని, అయితే దర్శకుడు కొత్తవాడు కావడంతో, తనపై నమ్మకం కుదరడానికి ఒక కండిషన్ పెట్టానని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ను చేయమని తానే ఒక లక్షన్నర్ర రూపాయలు ఇచ్చానని, ఆ తర్వాత తను తీసుకువచ్చిన టీజర్ నచ్చడంతో సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.
మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగా జగపతిబాబు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సదరు సంగతులను తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… ప్రధాన పాత్రలో నటిస్తున్న జగపతిబాబు, తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. కధ నచ్చడంతో పారితోషికం లేకుండా నిర్మాణ భాగస్వామిగా చేరి మరీ చేసిన “పటేల్ ఎస్.ఐ.ఆర్.” ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



