గడిచిన కొద్దిరోజులుగా తీవ్రదుమారం రేపుతోన్న శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధంలేని వ్యవహారంలోకి తనను లాగిందేకాక, తనపై, తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జరిగిన ఘటనలకు సూత్రధారి ముఖ్యమంత్రి తనయుడేనని ఆరోపించారు.
నారా లోకేశ్, టీవీ9 ఓనర్ శ్రీనీ రాజు – రవిప్రకాష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లోకేష్ స్నేహితుడు రాజేష్ కిలారు కలిసి అమరావతి సచివాలయంలో దారుణమైన కుట్రలు చేసారని, 10 కోట్ల రూపాయలు ఇచ్చిమరీ తన మాతృమూర్తిని తిట్టించారని పవన్ ఆరోపించారు. ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నా మొట్టమొదటి సారిగా మీడియాలోని వ్యక్తులపేరులు తీసుకుని విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటినుండి వెన్నుదన్నుగా నిలించింది టీవీ9. దాదాపుగా పవన్ కళ్యాణ్ ప్రతి అడుగుకు విస్తృత ప్రచారం కలిపించింది. అయితే తమను ఈ రాజకీయవివాదంలోకి లాగడం టీవీ9 పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీనికి పర్యవసానంగా పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్టు లేకుండా పోవచ్చు.
ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే ఉండటంతో జనసేనకు ఇది సంక్లిష్టంగా మారొచ్చు. మాములుగా రాజకీయ నాయకులు ప్రత్యర్థి అనుకూల మీడియా మీద విసుర్లు వెయ్యడం మాములే. అయితే చంద్రబాబు సాక్షి మీద, జగన్ ఆంధ్రజ్యోతి మీద ఆశలు వదిలేసుకుంటే తప్ప అంత ఓపెన్ గా ఒక మీడియా ఛానల్ మీద దాడి చెయ్యరు. ఇవన్నీ అలోచించి చేసారో లేక ఆవేశంతో చేసారో తెలియాల్సి ఉంది.



