‘జనసేన’ అధికార ప్రతినిధి అరెస్ట్!

Jana Sena Leader Sunkara Kalyan Dileep Arrested పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాయకుడు అయిన కల్యాణ్ సుంకరను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్న ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది.

ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్‌ లో ఐఫోన్ 7ను అమ్మకానికి పెట్టిన కల్యాణ్ ఒరిజనల్ ఫోన్‌కు బదులు డమ్మీ ఫోన్‌ను విక్రయించాడు. దీంతో ఫోన్ కొన్న వ్యక్తి డమ్మీ ఫోన్‌ ను ఎందుకు అమ్మావని ప్రశ్నించడంతో కల్యాణ్ అతడిని ఎయిర్‌ గన్‌తో బెదిరించి హల్‌చల్ చేశాడు.

ADVERTISEMENT

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కల్యాణ్ నుంచి ఫోర్డ్ ఎండీవర్ కారు, ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ జనసేన తరపున పలు చానెళ్లలో చర్చల్లోనూ పాల్గొంటున్న కళ్యాణ్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి!

ADVERTISEMENT
Latest Stories