జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా సిద్ధం!

Pawan Kalyan

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రలతో రాష్ట్ర రాజకీయాలలో ఎంతగా ప్రకంపనలు సృష్టించారో అందరికీ తెలుసు. గత కొంత కాలంగా పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు, టిడిపితో సీట్ల సర్దుబాటు చర్చలతో చాలా బిజీగా ఉండటం వలన ప్రజల మద్యకు పెద్దగా రాలేకపోయారు.

పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఈ నెల 14 నుంచి 17వరకు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించబోతున్నారు. మొదట రోజున భీమవరంలో తర్వాత వరుసగా అమలాపురం, కాకినాడ రాజమండ్రిలో పర్యటిస్తారు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలను మూడు దశలుగా నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు సాగే మొదటి దశ పర్యటనలో పార్టీ ముఖ్య నేతలతో, స్థానిక టిడిపి నేతలతో సమావేశమవుతారు.

రెండో దశ పర్యటనలలో పార్టీ కార్యకర్తలు జనసేన వీర మహిళలతో సమావేశమవుతారు. మూడో దశలో ఆయా ప్రాంతాలలో సభలు, రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జనసేన అభ్యర్ధులు పోటీ చేయబోయే ప్రతీ నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ కనీసం మూడుసార్లు పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

టిడిపి, జనసేనల పొత్తులు సీట్ల సర్దుబాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే బీజేపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నందున రెండు పార్టీలు తమ సీట్లు, అభ్యర్ధుల జాబితాలని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అటు టిడిపి, ఇటు జనసేనలో టికెట్స్ ఖరారు అయినవారికి ఈవిషయం తెలియజేశారు. కనుక వారు ‘పని’ మొదలుపెట్టేశారు.

బీజేపీతో టిడిపి పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై స్పష్టత వచ్చిన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేనకు మంచి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాలలో సీట్ల విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది కనుకనే పవన్‌ కళ్యాణ్‌ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరిన్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories