సీఎం జగన్ కు జనసేన వార్నింగ్

janasena warning to jaganముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్ చెయ్యడం మన అందరికి తెలిసిందే. “ఆయా పవన్ కళ్యాణ్ గారూ మీకు కూడా ముగ్గురు భార్యలు… వారికి నాలుగురో ఐదుగురో పిల్లలు వారు ఎక్కడ చదువుతున్నారు? ఏ మీడియం లో చదివిస్తున్నారు?,” అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.

జగన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇదేమి మొదటి సారి కాదు. ఎన్నికల ముందు కూడా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం, జనసేన శతాగ్ని టీం ఘాటుగా స్పందించింది. మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి? అంటూ హెచ్చరించారు.

ADVERTISEMENT

“వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్ధ జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?,” అంటూ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి చలవ వల్ల రాజకీయాలు కుటుంబాల వరకూ వెళ్లడం శోచనీయం. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories