కొంత కాలంగా జగన్ కు అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు ఎదురుకుంటున్న కేవీపీ రామచంద్రరావు కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం ఝలక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎపికి ప్రత్యేక హోదాపై , పోలవరం ప్రాజెక్టుపైన రామచంద్రరావు కాంగ్రెస్ సమావేశంలో షార్ట్ పిలిం ప్రదర్శించారట. అందులో చంద్రబాబును విమర్శించారట.
[m9ad]
దానికి జెడి శీలం ఏమిటీ డాక్యుమెంటరీ, కాంగ్రెస్ కు ఏమి ఉపయోగం, సొంత డబ్బా మాదిరి ఉందని శీలం విమర్శించారట. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందే తప్ప, జగన్‌ను ప్రశ్నించేలా లేదు. మనకు చంద్రబాబు ఎంత శత్రువో.. జగన్ కూడా అంతే శత్రువు. మన ఓటు బ్యాంకు అంతా వైసీపీలో ఉంది.
కాంగ్రెస్ లోకి మళ్లీ వలసలు రావాలంటే వైసీపీ నుంచే రావాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు వైసీపీనే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రదర్శనలు ఎందుకు అన్నారని ఆయన ప్రశ్నించారట. దీని బట్టి వైకాపాను టార్గెట్ చెయ్యాల్సిన అవసరాన్ని, కాంగ్రెస్ లో ఉంటూ జగన్ ఎజెండాను కేవీపీ అమలు చేస్తున్నారన్న విషయాన్నీ కాంగ్రెస్ గ్రహించిందన్నమాట!



